Search results - 39 Results
 • TN Stamp 1

  NATIONAL8, Aug 2018, 3:34 PM IST

  రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాట, ఇద్దరి మృతి, 40 మందికి గాయాలు

  మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతితో తమిళనాడు రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానుల ఆక్రందనలతో తమిళ నాట విషాద ఛాయలు అలుమున్నాయి. నిన్న సాయంత్రం నుండి తమ అభిమాన నాయకుడి కడసారి చూపుకోసం ఎదురుచూస్తున్న వారంతా చెన్నై బాట పట్టారు. దీంతో కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ జనసంద్రంగా మారింది.

 • Shreenivas Kuchibotla

  NRI8, Aug 2018, 11:41 AM IST

  కూచిబొట్ల శ్రీనివాస్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు....నిందితుడికి మూడు శిక్షలు

  అమెరికాలో జాత్యంహకంరానికి బలైన తెలుగు సాప్ట్ వేర్ కూచిబొట్ల శ్రీనివాస్(32) కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన  జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ కోర్టు హంతకుడు ఆడమ్ ప్యూరింటన్ కు మూడు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది. వీటిని అతడు ఒకటి తర్వాత ఒకటి అనుభవించాల్సి ఉంటుందని అమెరికన్ న్యాయస్థానం పేర్కొంది. 

 • operation muskan

  Telangana7, Aug 2018, 1:45 PM IST

  యాదాద్రి సెక్స్ రాకెట్... వ్యభిచారుణులనే తల్లులుగా భావిస్తూ రోదిస్తున్న చిన్నారులు

  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో పాపపు పనులు చేస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజుల నుండి అక్కడి వ్యభిచార గృహాలపై ఎస్‌వోటి, స్థానిక పోలీసులు కలిసి దాడులు జరుపుతున్నారు. అయితే ఈ దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. 

 • KTR

  Telangana1, Aug 2018, 5:23 PM IST

  టీఆర్ఎస్ లో చేరడానికి కాంగ్రెస్ నాయకులంతా రెడీ, ఆ ఇద్దరు మినహా: కేటీఆర్

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దంగా ఉన్నారని ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి మినహా మిగతావారంతా అధికార పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. తాము తలచుకుంటే కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయొచ్చు కానీ అలా చేయాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ లో చేరతామంటున్నా తామే వందంటున్నామని కేటీఆర్ తెలిపారు. 

 • mahindra and mahindra

  cars1, Aug 2018, 4:25 PM IST

  మహింద్రా నుండి మరో కొత్త మల్టీ పర్పస్‌ వెహికిల్‌

  వాహనాల తయారీ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ మహింద్రా ఆండ్ మహింద్రా. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా తమ కంపెనీ నుండి వాహనాలను విడుదల చేస్తూ మార్కెట్లో మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా ఎం ఆండ్ ఎం మరో కొత్త రకం మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపివి)ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. 

 • police

  Telangana1, Aug 2018, 3:02 PM IST

  కారంపొడి, రాళ్లతో పోలీసులపై దాడికిదిగిన భూకబ్జాధారులు, ఎస్సైకి తీవ్ర గాయాలు

  కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నించిన పోలీసులపై కబ్జాదారులు దాడికి దిగారు. కారం పొడి, రాళ్లతో ఇళ్లను కూల్చడానికి వచ్చిన పోలీసులపైనే దాడి చేశారు. దీంతో పోలీసులు కూడా ఆందోళనకారులపై లాఠీచార్జ్ కి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.  

 • NATIONAL1, Aug 2018, 10:58 AM IST

  పసి బాలుడి కోసం విమానం అత్యవసర ల్యాండింగ్, అయినా దక్కని ప్రాణాలు...

  కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్ లోని పాట్నా నగరానికి వెళుతున్న ఓ విమానం అత్యవసరంగా హైదరాబాద్ లో ల్యాండయింది. ఓ నాలుగు నెలల చిన్నారి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద హైదరాబాద్ కు డైవర్ట్ చేశారు. ఇంతచేసినా చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కలేదు. 

 • Telangana31, Jul 2018, 5:41 PM IST

  వాళ్లను కాల్చేస్తేనే దేశానికి రక్షణ : బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బిజెపి పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అదే పని చేశారు. దేశంలోని అక్రమ చోరబాటుదారులను కాల్చి చంపాలని, అప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇపుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.  

 • Andhra Pradesh31, Jul 2018, 1:48 PM IST

  నిరుద్యోగులకు శుభవార్త...టీచర్ల భర్తీకి మరో నోటిఫికేషన్

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ రిక్రూట్ మెంట్ కేవలం ప్రభుత్వ ఉర్ధూ మీడియం పాఠశాలల  
  టీచర్ల భర్తీకి సంబంధించింది. రాష్ట్రంలోని ఉర్ధూ మాధ్యమ స్కూళ్లల్లో 211 ఎస్జీటీ టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా రాష్ట్ర
  విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.

 • police

  Telangana30, Jul 2018, 5:48 PM IST

  కట్టుకున్న భర్తనే మోసం చేసిన భార్య, రూ.41 లక్షల కోసం....

  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కానీ హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓ కేసులో ఇంటిదొంగను పట్టుకున్నారు. భర్తను మోసం చేసి ఏకంగా రూ.41లక్షలు కాజేయాలని చూసిన ఓ భార్యను పోలీసులు పట్టుకున్నారు. 

 • Mohan babu abd bramhanandam

  Telangana30, Jul 2018, 11:09 AM IST

  గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ నటులు బ్రహ్మానందం, మోహన్ బాబు

  తమ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాదు, సామాజిక సేవలోను వెనుకడేగు వేయమని నిరూపిస్తున్నారు తెలుగు నటులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు గ్రీన్ ఛాలెంజ్ పేరిట రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు చెట్లను నాటించే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఛాలెంజ్ ఇపుడు సినీ ఇండస్ట్రీకి పాకింది. కొందరు నాయకులు విసిరిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, హీరో మోహన్ బాబు స్వీకరించారు.

 • Death

  Andhra Pradesh28, Jul 2018, 3:41 PM IST

  శ్రీకాళహస్తి హత్య మిస్టరీ: భర్తతో కలిసి ప్రియుడిని చంపిన మహిళ

  చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పదిరోజుల క్రితం జరిగిన హత్యా మిస్టరీని పోలీసులు చేదించారు. ఈ హత్యకు అక్రమ సంబందమే కారణంగా గుర్తించిన పోలీసులు తమదైన రీతిలో విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. మృతుడి ప్రియురాలే భర్తతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేశారు.

 • NATIONAL28, Jul 2018, 2:36 PM IST

  మహారాష్ట్రలో 500 అడుగుల లోయలో పడ్డ బస్సు, 32 మంది మృతి

  మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాగా ఎత్తునుండి పడటంతో బస్సులోని 32 మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం.

 • fake id

  Telangana28, Jul 2018, 1:11 PM IST

  నకిలీ తెలంగాణ పోలీసు అరెస్ట్, పెళ్లి పేరుతో బెంగళూరు మహిళను మోసం చేసి...

  తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పేర్కొంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ పోలీసును బెంగళూరు పోలీసులు అరెస్ట చేశారు. తెలంగాణలో తానో పోలీస్ ఉన్నతాధికారినని చెప్పి ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. అయితే ఆమె ఫిర్యాదుతో పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యాడు.

 • gang rape

  NATIONAL28, Jul 2018, 11:56 AM IST

  భార్య స్నేహితురాలిపై అత్యాచారం చేసిన భర్త, భార్య సహకారంతోనే..

  ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లో మరో దారుణ ఘటన చోటుచేసుంది. ఓ యువతిపై స్నేహితురాలి భర్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే  స్నేహితురాలి సహకారంతోనే ఆమె భర్త తనపై అఘాయిత్యానికి పాల్నడినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.