Bc Garjana Sabha
(Search results - 8)Andhra PradeshFeb 21, 2019, 4:15 PM IST
మాట నిలబెట్టుకున్న జగన్: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ నేత జంగా
ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తిని ప్రకటించింది. అందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందజేశారు.
Andhra PradeshFeb 18, 2019, 6:48 PM IST
జడ్జిలుగా బీసీలు పనికి రారని చంద్రబాబు లేఖ రాయలేదా..?: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కౌంటర్
గత 40 ఏళ్లుగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదని విమర్శించారు. బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు.
Andhra PradeshFeb 18, 2019, 3:11 PM IST
వైసీపీలో చేరిన వారు త్వరలోనే తప్పు చేశామని బాధపడతారు: వర్ల రామయ్య
మరోవైపు ఏపీ ప్రజలపై జగన్ కక్షగట్టారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్ కు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అటు పార్టీ ఫిరాయింపులపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వారు స్వప్రయోజనాల కోసమే ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ విరుచుకుపడ్డారు.
Andhra PradeshFeb 17, 2019, 11:36 PM IST
బీసీలపై జగన్ కపట ప్రేమ రాజకీయ లబ్ధికోసమే: రామ్మోహన్ నాయుడు
అన్ని వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. బీసీల పట్ల జగన్‌ది కపట ప్రేమ మాత్రమేనని విమర్శించారు. తెలంగాణలో తొలగించిన బీసీ కులాలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
Andhra PradeshFeb 17, 2019, 11:09 PM IST
కేసీఆర్ తో నేను మాట్లాడతా, వారిని బీసీ జాబితాలో చేర్చాలని కోరుతా: వైఎస్ జగన్
తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 32 కులాలను మళ్లీ బీసీ జాబితాలో చేర్చేలా సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడుతానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ తో భేటీ అయ్యి ఈ విషయంపై చర్చిస్తానన్నారు.
Andhra PradeshFeb 17, 2019, 10:52 PM IST
వైసీపీ బీసీ గర్జన సభ ఎఫెక్ట్: భారీ ట్రాఫిక్ జామ్, గంటన్నరపాటు ఇరుక్కుపోయిన జగన్
ఇదే ట్రాఫిక్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఇరుక్కుపోయారు. సుమారు గంటన్నరపాటు వైఎస్ జగన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఇక సభ పరిసర ప్రాంతాల్లో అయితే విషయం మామూలుగా లేదు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అయితే 2గంటలుగాపైగా ట్రాపిక్ లో చిక్కుకుపోయారు.
Andhra PradeshFeb 17, 2019, 10:43 PM IST
నీ స్థానంలో నేనుంటే రైలుకింద తలపెట్టుకునేవాడిని, గాజులు తొడుక్కోలేదు: తలసానిపై మంత్రి అచ్చెన్న ధ్వజం
తలసాని స్థానంలో తాను ఉంటే రైలుకింద తలపెట్టుకుని చనిపోయేవాడినంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యవర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ బీసీ గర్జన సభకు తెలంగాణ నుంచి జనాన్ని తెచ్చుకున్నారని సిగ్గులేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Andhra PradeshFeb 13, 2019, 5:42 PM IST
వైఎస్ జగన్ తో బీసీ నేతల సమావేశం: డిక్లరేషన్ పై చర్చ
ఇకపోతే ఫిబ్రవరి 17న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించబోయే బీసీ గర్జన సభలో ఇవ్వాల్సిన హామీలపై చర్చించారు. బీసీ వర్గాలను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు వారి అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు.