Bailout  

(Search results - 5)
 • celltowers

  Technology30, Oct 2019, 11:02 AM

  ఉచిత కాల్స్‌ ‘ఎరా’కు తెర!.. చౌక డేటాకు చెల్లుచీటి!!

  టెలికం రంగ సంస్థలు ఎదుర్కొంటున్న కష్టాలపై అధ్యయనానికి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. ఏజీఆర్ చెల్లింపులు జరుపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా చిక్కుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో తమకు టైం కావాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. దీంతో సమస్యలపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ.. ఉచిత కాల్స్, చౌక డేటా విధానాలకు చెల్లుచీటి పలుకాల్సిందిగా టెలికం ప్రొవైడర్లను కోరే అవకాశాలు ఉన్నాయి. వినియోగదారులకు ఆఫర్లు దూరం కావడంతోపాటు త్వరలో టెలికం సంస్థలకు ఉద్దీపన ప్యాకేజీ అందుబాటులోకి రానున్నది.  

 • thomas

  business23, Sep 2019, 4:31 PM

  థామస్ కుక్‌కు బెయిలౌట్ ఇవ్వలేం: బోరిస్ జాన్సన్.. ఎందుకంటే..

  175 ఏళ్ల విమాన యాన సంస్థ థామస్ కుక్ దివాళా ప్రకటించింది. కానీ దాన్ని ఆదుకునేందుకు బెయిలౌట్ ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిరాకరించారు. సంస్థ డైరెక్టర్ల వల్లే నష్టాలు వచ్చాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 

 • ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)లు ప్రైవేట్ రంగ సంస్థల పోటీకి తట్టుకోలేకపోతున్నాయి. ఆశించిన స్థాయిలో వ్యాపారం లేక నిర్వహణ భారమై అప్పుల ఊబిలో కూరుకున్నాయి.

  TECHNOLOGY3, Jul 2019, 10:44 AM

  బీఎస్ఎన్ఎల్‌కు బెయిలౌట్.. బట్ వీఆర్ఎస్‌లు తప్పవ్!!

  ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు మూసివేత భయం తప్పింది. మోయలేని అప్పుల భారంతో ఇక్కట్ల పాలవుతూ, ఉద్యోగుల వేతనాలు చెల్లింపునకు ఆపసోపాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణపై ఊహాగానాలు సాగాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సహకారం కొరవడింది. ఫలితంగా సిబ్బంది, వినియోగదారులు అయోమయానికి గురవుతూ వచ్చారు. మూసివేత సంకేతాలపై ఆందోళన వ్యక్తం కావడంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వ్యూహాత్మకంగా వీఆర్ఎస్ నిమిత్తం భారీ ఆకర్షణీయ ప్యాకేజీ అమలు చేయనున్నట్లు సమాచారం. 

 • Vijay mallya

  business26, Mar 2019, 12:10 PM

  నా డబ్బుతో జెట్‌ను ఆదుకోండన్న మాల్యా

  పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్య.. భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని ఆరోపించారు. 

 • Naresh goyal

  business1, Mar 2019, 1:33 PM

  జెట్ ఎయిర్వేస్ ‘నరేశ్‌గోయల్’ కథ కంచికే? ఇక ఇతేహాద్‌దే పై చేయి?

  దేశీయ పౌర విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే యాజమాన్యం చేతులు మారనున్నది. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్ వాటాలను కొనుగోలు చేయనున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ చైర్మన్ హోదాలో ఉన్న నరేశ్ గోయల్ ఆ పదవిని వదులుకోనున్నారు. ఈ మేరకు బ్యాంకర్ల రుణాలను ఈక్విటీలుగా మార్చిన తర్వాత సదరు బ్యాంకర్లు గోయల్, ఎతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.