Automobile News  

(Search results - 16)
 • battery

  Automobile8, Jun 2019, 3:25 PM IST

  మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్న హైదరాబాద్... ఐదేళ్లలో విద్యుత్ వెహికల్స్

  తెలంగాణ ‘శిఖ’లో మరో కీర్తి కిరీటం చేరబోతున్నది. త్వరలో యావత్ దేశం విద్యుత్ వాహనాల వినియోగానికి సంసిద్ధమవుతున్నది. ప్రత్యేకించి ఆ వాహనాలను వినియోగించేందుకు అవసరమైన లీథియం బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన 200 ఎకరాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు సుముఖత వ్యక్తం చేసింది. బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు 5 రాష్ట్రాలను ఎంపిక చేస్తామని నీతి ఆయోగ్‌ పేర్కొంది. 

 • cars21, Mar 2019, 5:05 PM IST

  మళ్లీ బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన టాటా టియాగో...

  ప్రయాణ వాహనాల విక్రయాల్లో టాటా టియాగో బెస్ట్ ఎస్ యూవీ మోడల్ కారుగా నిలిచింది. 14 నెలల తర్వాత బెస్ట్ సెల్లర్ కార్లలో ఒకటిగా నిలిచిందని సియామ్ పేర్కొంది. 
   

 • cars4, Feb 2019, 2:38 PM IST

  సరికొత్త రూపంలో మార్కెట్లోకి హ్యుండాయ్ క్రెటా...మార్పులివే

  దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ క్రెటా కంపాక్ట్ ఎస్‌యూవీని ఆధునీకరించి కన్వర్టబుల్ ఎస్‌యూవీగా రూపొందిస్తున్నారు. ఇది చూడటానికి లెగిట్ మోడల్ కారు మాదిరిగా ఉంటుంది. తదనుగుణంగా డిజైనర్ కూడా వైండ్ షీల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతోపాటు రూప్, సీ- పిల్లర్ తొలగించారు.
   

 • nissan crick

  cars23, Jan 2019, 10:30 AM IST

  నిస్సాన్‌ కారు కొంటే వరల్డ్ కప్ వీక్షించే సదవకాశం...

  భారత్ మార్కెట్లో ఆవిష్క్రుతమైన నిస్సాన్ న్యూ మోడల్ కారు కిక్స్ ఎస్‌యూవీ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. తొలి 500 కార్లు బుకింగ్ చేసుకున్న వారికి ఇంగ్లండ్‌లో జరిగే ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీని వీక్షించే అవకాశం కల్పించనున్నది. 

 • yamaha fz

  Bikes22, Jan 2019, 11:10 AM IST

  యమహా ఎఫ్ జడ్ సీరిస్‌లో సరికొత్త బైకులు...గతంలో కంటే తగ్గింపు ధరల్లో

  యమహా ఇండియా డీలక్స్ శ్రేణి ఎఫ్ జడ్ సిరీస్ బైకులను మార్కెట్లోకి ఆవిష్కరించింది. వీటి ధరలు రూ.95 వేల నుంచి రూ.97 వేల వరకు పలుకుతాయి. ఇక ఎఫ్ జడ్ -25, ఫేజర్ -25 మోడల్ మోటారు సైకిళ్లు రూ.1.33 లక్షలు, రూ.1.43 లక్షలకు వినియోగదారులక అందుబాటులోకి రానున్నాయి. 
   

 • bajaj

  News22, Jan 2019, 10:50 AM IST

  బజాజ్‌ నుండి ఎలక్ట్రిక్ వాహనాలు: రాజీవ్ బజాజ్ ప్రకటన

  దేశీయ ఆటోమొబైల్ మేజర్ ‘బజాజ్ ఆటో’ వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగు పెట్టనున్నది. బీఎస్ -6 నిబంధనల అమలుతోపాటు ఎలక్ట్రిక్ క్యూట్, ఆటోలు తమ ఎజెండాలో ముందు ఉన్నాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. త్వరలో విద్యుత్ వినియోగ స్కూటర్‌ను కూడా మార్కెట్లో అందుబాటులోకి తెస్తామన్నారు. 

 • suzuki

  News19, Jan 2019, 11:23 AM IST

  భారత్‌లో మరో భారీ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు...జపాన్ కంపనీ ప్రకటన

  వైబ్రంట్ గుజరాత్ సదస్సు ఆ రాష్ట్ర ప్రగతికి అవసరమైన పెట్టుబడులు కురిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే మూడో ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ఆటో మేజర్ ‘సుజుకి మోటార్స్ కార్పొరేషన్’ ప్రకటించింది. ప్రత్యేకించి విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తామని పేర్కొంది. టాటా సన్స్ నుంచి బిర్లా గ్రూప్, టొరెంటో తదితర సంస్థలు భారీగా పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించాయి.

 • EV

  News18, Jan 2019, 1:55 PM IST

  విద్యుత్ వాహనాల ఉత్పత్తే లక్ష్యంగా ''ఫేమ్''... రూ.5,500 కోట్లతో

  మార్చి నెలాఖరు నాటికి ‘ఫేమ్’ పథకం మలిదశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. వచ్చే ఐదేళ్ల పాటు విద్యుత్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపైనే కేంద్రం కేంద్రీకరించనున్నది. 

 • Cars

  cars1, Jan 2019, 3:18 PM IST

  ఆ కార్లకు భారత్‌లో భలే గిరాకీ...2018లో భారీ అమ్మకాలు

  ఆటోమొబైల్ రంగంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూవీ) పట్ల వినియోగదారుల్లో క్రేజ్ పెరిగిపోతున్నది. గతేడాది (2018)లో మొత్తం కార్ల సేల్స్ లో సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ సబ్ కంపాక్ట్ మోడల్స్ విక్రయాల్లో 23 శాతం పురోగతి లభించింది. 

 • HAYABUSA111

  Bikes27, Dec 2018, 3:51 PM IST

  భారత మార్కెట్లోకి హయబుస 2019 బైక్... ధర ఎంతో తెలుసా?

  ప్రముఖ వాహనతయారీ సంస్థ సుజుకి మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త హంగులతో మరో నూతన ద్విచక్ర వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత 20 ఏళ్లుగా భారతీయ యువతకు వివిధ మోడళ్ల రూపంలో ఆకట్టుకున్న హయబుస... మరో సరికొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. 

 • bajaj chetak

  Automobile24, Jul 2018, 1:52 PM IST

  బజాజ్ చేతక్ మళ్లీ భారత మార్కెట్లోకి రానుందా?

  బజాజ్ చేతక్...పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చిన వాహనం. ఈ చేతక్ ను ఆదారంగా చేసుకునే ఇప్పుడున్న స్కూటీలు మార్కొట్లోకి వచ్చాయనడం అతిశయోక్తి కాదేమో. అయితే మార్కెట్ లో చోటుచేసుకున్న విస్తవాత్మక మార్పుల కారణంగా ఈ చేతక్ కాలగర్భంలో కలిసిపోయింది. అయితే మళ్లీ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చి మరోసారి ఆటోమొబైల్ రంగంలో ప్రభంజనం సృష్టించాలని బజాజ్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 • BMW bykes

  Automobile19, Jul 2018, 1:45 PM IST

  భారత మార్కెట్ లోకి బిఎమ్‌డబ్ల్యూ బైకులు, అందుబాటు ధరల్లోనే...

  సంపన్నుల కోసమే అన్నట్లుగా ఖరీదైన కార్లను తయారుచేసే బిఎమ్‌డబ్ల్యూ సంస్థ టూ వీలర్ల తయారీ విభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బీఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ రెండు సూపర్ బైక్ లను లాంచ్ చేసింది. జి310ఆర్ మరియు జి310జిఎస్ బైకులను భారత విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేసింది. అయితే వీటిని కాస్త తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ - రూ. 2.99 లక్షలు, బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ - రూ. 3.49 లక్షలకు (ఎక్స్ షోరూం ధరలు) ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

 • electrical cycle

  Automobile18, Jul 2018, 4:17 PM IST

  మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల, ధర చూస్తే మాత్రం దిమ్మతిరగడం ఖాయం

  ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా ఓ ఎలక్ట్రికల్ సైకిల్ విడుదలైంది. ట్రాంక్స్ మోటార్స్  సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సరికొత్త ట్రాంక్స్ వన్ ఎలక్ట్రికల్ సైకిల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే సైకిల్ అనగానే సామాన్య మద్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ఉందనుకుంటే పొరబడినట్లే. దీని ధరను చూస్తే మాత్రం కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఇది రూ.49,999 (ఎక్స్ షోరూం) కు మార్కెట్లో అందుబాటులో ఉంది.

 • BMW 3 GT

  Automobile13, Jul 2018, 2:26 PM IST

  ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ 3సిరీస్‌ జీటీ స్పోర్ట్స్‌ విడుదల

  విలాసవంతమైన కార్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బీఎండబ్యూ. కేవలం విలాసవంతమైన కార్లను మాత్రమే తయారుచేసే ఈ సంస్థ నుండి మరో స్పోర్ట్స్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. బీఎండబ్ల్యూ 3సిరీస్‌ జీటీ స్పోర్ట్స్‌ రకానికి చెందిన 320డి జీటీ స్పోర్ట్‌ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ స్పోర్ట్స్ కారు ప్రారంభ ధరను రూ. 46.60 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించింది.