Akbaruddin Owaisi Takes Oath As Chandrayangutta Mla
(Search results - 1)TelanganaMar 9, 2019, 5:01 PM IST
ప్రమాణస్వీకారం చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ లో ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు రెండు నెలలు కావస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ లో కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు జనవరి 17న ప్రమాణస్వీకారం చేశారు. అయితే అప్పుడు మొత్తం 119 ఎమ్మెల్యేలకు గాను 114 మంది మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. వివిధ కారణాలతో ప్రోటెం స్పీకర్ వద్ద ప్రమాణస్వీకారం చేయలేకపోయిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.ఇలా తాజాగా చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ నుండి గెలుపొందిన అక్బరుద్దిన్ ఓవైసి ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.