Aicc President
(Search results - 32)Andhra PradeshNov 27, 2019, 3:26 PM IST
నువ్వు స్పీకరా లేక బ్రోకరా: తమ్మినేని సీతారాంపై మహిళ నేత ఫైర్
వైసీపీ మంత్రులు, స్పీకర్ మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ వారు ప్రయోగిస్తున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.
TelanganaNov 14, 2019, 5:53 PM IST
అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి కన్ను
టీపీసీసీ అధ్యక్ష పదవికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్ బాబు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఇకపోతే పీసీసీ చీఫ్ పదవిని తాను ఆశిస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ ఎదుట తన మనసులో మాట చెప్పారు.
NATIONALSep 13, 2019, 4:32 PM IST
శాంతించని రాహల్ గాంధీ: సోనియాగాంధీ సమావేశానికి గైర్హాజరు
కాంగ్రెస్ నేతలంతా ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా పోస్టులకు స్వస్తి పలికి ప్రత్యక్ష రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించాలని సోనియా దిశానిర్దేశం చేశారు.
NATIONALAug 9, 2019, 6:20 PM IST
కాంగ్రెస్ రథసారథిగా ముకుల్ వాస్నిక్...?
గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు, సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు, రాజకీయ కార్యదర్శి ముకుల్ వాస్నిక్ కు అధినేత బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అధికారికంగా శనివారం సీడబ్ల్యూసీ ప్రకటించనుందని తెలుస్తోంది.
NATIONALJul 3, 2019, 2:59 PM IST
రాహుల్ గాంధీ ససేమిరా: అశోక్ గెహ్లాట్ కు చాన్స్, ఢిల్లీకి పయనం
అశోక్ గెహ్లాట్ కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హూటాహుటిన అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి బయలు దేరారు. ఇకపోతే అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీ సీనియర్లతో పాటు రాహుల్ కుటుంబసభ్యులు సైతం అశోక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
TelanganaJun 29, 2019, 3:51 PM IST
కాంగ్రెస్ పదవికి వీహెచ్ రాజీనామా
రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: ఏఐసీసీ కార్యదర్శి పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన నెలకొందని వీహెచ్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీని ఒక్కరినే బాధ్యుడును చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ప్రతీ ఒక్కరూ బాధ్యులేనని తెలిపారు.
రాహుల్ గాంధీ రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరారు. గాంధీ కుటుంబం పక్కకి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదమన్నారు. పారాచూట్లకు టికెట్లు ఇవ్వడం వల్లే నష్టం వాటిల్లిందనిలేని చెప్పుకొచ్చారు.
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం రాజీనామా చేశారు. తన హయాంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయిందని, రాహుల్ గాంధీ తరహాలోనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కూడా రాజీనామా చేశారు.
Andhra PradeshJun 24, 2019, 7:38 PM IST
తప్పంతా రాహుల్ గాంధీ, చంద్రబాబు చేసి మాపై ఎందుకు ఏడుస్తారు: టీడీపీపై విష్ణువర్థన్ రెడ్డి ఫైర్
టీడీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ ఏనాడు చట్ట సభల నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదని ఆయన తెలిపారు. తప్పు అంతా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో పెట్టుకుని మీడియాముందు బీజేపీపై పడి ఏడవడం ఎందుకు అంటూ నిలదీశారు విష్ణువర్థన్ రెడ్డి.
NATIONALMay 22, 2019, 3:36 PM IST
ఎగ్జిట్ పోల్స్ చూసి భయపడకండి, మిమ్మల్ని మీరే నమ్ముకోండి : రాహుల్ హితబోధ
ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూసి భయపడొద్దంటూ హితవు పలికారు. ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకు.. రాబోయే 24 గంటలు మనకెంతో విలువైన సమయం. ఎంత వీలైతే అంత అప్రమత్తంగా ఉండండి. భయపడకండి. మనం వాస్తవాల కోసం పోరాడుతున్నాం. ఎగ్జిట్ పోల్స్‌ను చూసి భయపడకండి.
NATIONALMay 17, 2019, 4:53 PM IST
సత్యమే గెలుస్తుంది: రాహుల్ ధీమా
ఈసారి ఎన్నికల్లో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ గానీ బీజేపీ నేతలు గానీ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ స్పందించలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం అడ్డుకుందన్నారు.
NATIONALMay 9, 2019, 2:02 PM IST
పౌరసత్వం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
రాహుల్ గాంధీకి పౌరసత్వంపై దాఖలైన పిటీషన్ ను సర్వోన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం ఉందని అందువల్ల ఆయనను ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా బహిష్కరించేలా ఈసీని ఆదేశించాలన్న పిటీషనర్ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
NATIONALMay 8, 2019, 7:56 PM IST
రాహుల్ ను కలిసిన చంద్రబాబు: మే 21న కీలక భేటీకి ప్లాన్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో మే 21న విపక్ష పార్టీలన్నింటితో సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మే 21న బీజేపీ యేతర కూటమి ఎజెండాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
NATIONALApr 6, 2019, 4:20 PM IST
రాహుల్ గాంధీకి తప్పలేదు: చుక్కలు చూడాల్సిందేనా....
దీంతో రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీయే పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీ పేరు చివర కేఈ తప్ప ఇద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయి. అంతేకాదు రాహుల్ గాంధీ కేఈ నామినేసన్లో సరికొత్త అంశాలు కూడా ఉన్నాయి. రాహుల్ గాంధీ కేఈకి ఓ సొదరుడు ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ గాంధీ కేఈ.
TelanganaMar 9, 2019, 7:58 PM IST
దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టడమా నీ దేశభక్తి: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
సైనికులు చనిపోతే ఇలానా వ్యవహరించేది అని విరుచుకుపడ్డారు. ఉగ్రవాద దాడి జరిగి మూడున్నర గంటల తర్వాత అది కూడా సినిమా షూటింగ్ పూర్తైనప్పుడు స్పందించారని తెలిపారు. ఇది మోదీకి, బీజేపీకి ఉన్న దేశభక్తికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. తాను ఎవరిముందు తలవంచనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
TelanganaMar 9, 2019, 7:40 PM IST
నీరవ్ మోడీ జేబులో మోదీ డబ్బులేస్తే, నేను పేదవాడి అకౌంట్లో వేస్తా: రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్రమోదీ నీరవ్ మోడీ జేబులో డబ్బులు వేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తోందని తెలిపారు. అంతేకాదు నీరవ్ మోదీని పట్టుకుని ఆ సొమ్మును కూడాప్రజలకే పంచిపెడతామని తెలిపారు.
Andhra PradeshFeb 22, 2019, 6:41 PM IST
పుల్వామా ఘటన తెలిసినా ఆపని సినిమా షూటింగ్, జవాన్ల మరణం కంటే సినిమా గొప్పదా: మోదీపై రాహుల్ గాంధీ ఫైర్
ఒక సినిమా షూటింగ్ లో ఉన్న మోదీకి ఉగ్రవాద దాడి గురించి తెలిసినా కనీసం పట్టించు కోలేదన్నారు. నవ్వుతూ సినిమా షూటింగ్ చేశారంటూ ధ్వజమెత్తారు. మానవత్వమున్న వ్యక్తిగా ప్రతీ పౌరుడు చలించిపోతే మోదీలో మాత్రం ఏ కదలిక లేదన్నారు.