Abu Bakr Al Baghdadi
(Search results - 7)INTERNATIONALNov 5, 2019, 10:39 AM IST
ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు.. ఐసిస్ గురించి కీలక సమాచారం?
ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.
INTERNATIONALOct 31, 2019, 2:09 PM IST
al-baghdadi video : ఉగ్రవాది బాగ్దాదీ హతం వీడియో విడుదల చేసిన పెంటగాన్
కరుడుగట్టిన ఐఎస్ఐ ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీని ఇటీవల అమెరికా రక్షణ విభాగం అంతమొందించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోని, ఫోటోలను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రక్షణ బలగాలు బాగ్దాదీ ఇంటిని చుట్టుముడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
INTERNATIONALOct 31, 2019, 1:01 PM IST
ఉగ్రవాది బాగ్దాదీ హతం.. వీడియో విడుదల చేసిన పెంటగాన్
దాడి చేయక ముందు బాగ్దాదీ ఇల్లు ఏవిధంగా ఉంది..? దాడి చేసిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. పెంటగాన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా వివరించారు.
INTERNATIONALOct 29, 2019, 12:44 PM IST
బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే
కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.
INTERNATIONALOct 27, 2019, 7:40 PM IST
ఐసీస్ చీఫ్ బాగ్దాదీ మృతి: ధృవీకరించిన ట్రంప్
ఐసీస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతి చెందినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.
Weekend SpecialOct 27, 2019, 12:28 PM IST
క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని
అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం
INTERNATIONALOct 27, 2019, 11:20 AM IST
లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది