'సీపీఐ
(Search results - 157)CricketJan 4, 2021, 6:15 PM IST
గంగూలీపై రాజకీయాల్లోకి రావాలంటూ పొలిటికల్ ప్రెషర్... గుండెపోటుకి కారణం ఇదేనా...
బీసీసీఐ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకి గురైన సంగతి తెలిసిందే. శనివారం గుండెపోటుకి గురైన గంగూలీ, ప్రస్తుతం నిలకడగా కోలుకుంటున్నారు. అయితే గంగూలీకి గుండెపోటు రావడానికి రాజకీయాల్లోకి రావాలని పొలిటికల్ పార్టీలు చేస్తున్న ఒత్తిడే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ సీపీఐ నాయకుడు అశోక్ భట్టాచార్య...
Andhra PradeshDec 30, 2020, 2:07 PM IST
కర్నూల్లో భగ్గుమన్న ఫ్యాక్షన్ గొడవలు: సీపీఐ నేతపై సీనీ పక్కీలో దాడి
అమర్ నాథ్ రెడ్డి దాడిలో సీపీఐ నేత రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
Andhra PradeshDec 29, 2020, 11:08 AM IST
సీపీఐ నేత నారాయణ పై ఎమ్మెల్యే రోజా ఫైర్
అసలు నారాయణ నగరికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. సీ.పీ.ఐ. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికి తెలుసునని.. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ చేశారని రోజా విమర్శించారు.
Andhra PradeshDec 13, 2020, 11:43 AM IST
అమరావతికి మద్దతుగా మహాపాదయాత్ర: సీపీఐ, టీడీపీ సంఘీభావం
విద్యానగర్ సమీపంలోని శుభం కళ్యాణ మండపం నుంచి గుజ్జనగుండ్ల, హనుమయ్య కంపెనీ, బృందావన్ గార్డెన్స్, ఎన్టీఆర్ స్టేడియం, లక్ష్మిపురం మీదుగా సాగిన పాదయాత్ర లాడ్జ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర సాగింది.
TelanganaDec 2, 2020, 10:15 PM IST
ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్‌కు సర్వం సిద్ధం
ఓల్డ్ మలక్‌పేటలోని డివిజన్ నంబరు 26లో సీపీఐ అభ్యర్థి ఎన్నికల గుర్తుకు బదులుగా సీపీఎం గుర్తును ముద్రించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దీనిని గుర్తించిన సంగతి తెలిసిందే.
TelanganaDec 1, 2020, 12:57 PM IST
గ్రేటర్ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా..!
కరోనా భయంతో కాబోలు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకురావడం లేదు. కాగా.. ఉదయం 11 గంటల వరకు డివిజన్ల వారిగా పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
TelanganaDec 1, 2020, 12:45 PM IST
ఓల్డ్ మలక్‌పేట 26వ డివిజన్లో పోలింగ్ రద్దు: డిసెంబర్ 3న రీ పోలింగ్
ఈ విషయాన్ని గుర్తించిన సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఫిర్యాదు చేశారు.TelanganaDec 1, 2020, 11:08 AM IST
గుర్తులు తారుమారు: ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు
ఓల్డ్ మలక్ పేట లోని 26వ డివిజన్ లో సీపీఐ అభ్యర్ధి గుర్తు తారుమారైంది. ఈ విషయమై సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. బ్యాలెట్ పత్రంలో సీపీఐ గుర్తు కంకికొడవలికి బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ముద్రించారు.
TelanganaDec 1, 2020, 11:02 AM IST
బల్దియా ఎన్నికల్లో గజిబిజీ.. ఎన్నికల గుర్తులు తారుమారు
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్లో గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ అభ్యర్థి గుర్తు కంకి కొడవలికి బదులు, ఎదురుగా సీపీఎం అభ్యర్థి గుర్తు సుత్తి కొడవలి ఉంది
TelanganaNov 19, 2020, 8:03 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: వామపక్షాల రెండో జాబితా
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు 11 మందితో తొలి జాబితాను ప్రకటించగా.. తాజాగా గురువారం 15 మందితో రెండో జాబితాను విడుదల చేశాయి.
TelanganaNov 18, 2020, 7:19 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: ఉమ్మడిగా రంగంలోకి వామపక్షాలు.. తొలి జాబితా విడుదల
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో వామపక్షాలు నిలిచాయి. దీనిలో భాగంగా సీపీఎం, సీపీఐలు ఉమ్మడిగా రంగంలోకి దిగాయి. ఇందుకు సంబంధించి అభ్యర్ధుల కసరత్తును పూర్తి చేసిన లెఫ్ట్ పార్టీలు బుధవారం తొలి జాబితాను విడుదల చేశాయి.
TelanganaNov 13, 2020, 1:24 PM IST
దళితులంటూ పూజలకు నో చెప్పిన పూజారి: జనగామలో ఆందోళన, అరెస్ట్
జనగామ పట్టణంలోని గణేష్ వాడలోని ఆంజనేయస్వామి ఆలయంలో లంకపల్లి భాస్కర్ కుటుంబం శాంతిపూజలు చేయించుకొనేందుకు ఇవాళ ఆలయానికి వచ్చింది. దళితులైన కుటుంబం కావడంతో శాంతి పూజ చేయడానికి పూజారి ఆంజనేయశర్మ నిరాకరించాడు. ఆలయం నుండి వెళ్లిపోవాలని పూజారి చెప్పాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
TelanganaOct 28, 2020, 12:25 PM IST
దుబ్బాక బైపోల్: తటస్థంగా ఉండాలని సీపీఐ నిర్ణయం, కానీ ట్విస్ట్ ఇదీ...
ఈ ఎన్నికల్లో సీపీఐ పోటీకి దూరంగా ఉంది.ఈ నియోజకవర్గంలో సీపీఐకి ఓట్ బ్యాంకు ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడ మద్దతును సీపీఐ ప్రకటించలేదు. తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీఐ తెలిపింది.TelanganaOct 13, 2020, 3:31 PM IST
అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్ మంగళవారం నాడు మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
TelanganaOct 13, 2020, 9:07 AM IST
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: కోదండరాంకు బిగ్ షాక్
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు భారీ షాక్ తగిలింది. కోదండరాంకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి ఆరు వామపక్షాలు నిరాకరించాయి. సీపీఐ తన అభ్యర్థిని పోటీకి దించుతోంది.