షియోమీ  

(Search results - 55)
 • undefined

  Gadget26, May 2020, 5:28 PM

  5జి సపోర్ట్ తో షియోమీ రెడ్ మి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్...

  రెడ్‌మి 10 ఎక్స్‌ స్మార్ట్  ఫోన్ 4జి, 5జి వేరియంట్లలో అందిస్తుండగా, రెడ్‌మి 10 ఎక్స్ ప్రోకు మాత్రం కేవలం 5జి వేరియంట్లో లభిస్తుంది. రెండు ఫోన్లు డ్యూయల్ బ్యాండ్ 5జికి సపోర్ట్ ఇస్తాయి. ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

 • undefined

  Gadget14, May 2020, 5:05 PM

  పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో పోకో ఎఫ్2ప్రో స్మార్ట్ ఫోన్...

  పోకో ఎఫ్ 2 ప్రో ధర బేస్ వర్షన్ 6జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర  499 యూరోల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో మాత్రం పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ పై వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఫిబ్రవరిలో పోకో ఎక్స్ 2 ను ఇండియాలోకి ప్రవేశించింది, ఇది ఇప్పటివరకు రియల్ మీ 6 ప్రో, షియోమి రెడ్ మీ నోట్ 9 ప్రోకి గట్టి పోటీని ఇస్తుంది.

 • <p>XIAOMI&nbsp;</p>

  Technology3, May 2020, 12:11 PM

  అవసరాలకు మించి డేటా వినియోగం అబద్దం: షియోమీ


  షియోమీ తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్‌ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని మనుకుమార్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు.

 • nature

  Gadget2, Apr 2020, 11:32 AM

  జీఎస్టీ శ్లాబ్ పెంపు: భారీగా పెరిగిన స్మార్ట్ ఫోన్ల ధరలు

  స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగనున్నాయి. గత నెలలో స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి ఈ శ్లాబ్ అమలులోకి వచ్చింది. దీన్ని గుర్తు చేస్తూ షియోమీ ఇండియా ఎండీ మను కుమార్ జైన్ ట్వీట్ చేస్తూ తమ బ్రాండ్ ఫోన్ల ధరలు 50 శాతం పెరుగుతాయని ప్రకటించారు. రియల్ మీ, ఒప్పో ఫోన్ల ధరలు కూడా వాటి శ్రేణిని బట్టి రూ.500 నుంచి రూ.2000 వరకు పెరిగాయి.

 • undefined

  Gadget20, Mar 2020, 2:41 PM

  31న విపణిలోకి షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌...

  షియోమీ తన సబ్ బ్రాండ్ ఎంఐలో ఎంఐ 10 మోడల్ 5జీ ఫోన్ ఈ నెల 31న భారత విపణిలోకి విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. దీని ధర రూ.42,400 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
   

 • undefined

  Gadget11, Mar 2020, 11:27 AM

  ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ఫ్రింట్, ఎంఐ 108 ఎంపీ కెమెరాతో షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్లు...

  చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ మార్చి 27న తన ఎంఐ 10 సిరీస్ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా 108 ఎంపీ పెంటా కెమెరాను తీసుకొస్తోంది.

 • undefined

  Gadget3, Mar 2020, 12:40 PM

  విపణిలోకి రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్ ఫోన్... ఆవిష్కరించనున్న బాలీవుడ్ హీరో

  షియోమీ వారి రెడ్ మీ నోట్ 9 ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ చేతుల మీదుగా విపణిలో అడుగు పెట్టనున్న ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
   

 • undefined

  Gadget13, Feb 2020, 1:16 PM

  షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంఐ10 ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.43 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది.

 • undefined

  Gadget11, Feb 2020, 5:27 PM

  రెడ్‌మి ఫాస్ట్‌ చార్జింగ్‌ పవర్‌ బ్యాంక్‌లను లాంచ్‌ చేసిన షియోమీ

   కొత్త రెడ్‌మి బ్రాండెడ్ పవర్ బ్యాంకులను ఈ రోజు భారతదేశంలో లాంచ్ చేసింది. రెడ్‌మి పవర్ బ్యాంక్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. 10,000 ఎమ్ఏహెచ్ ఇంకా  20,000 ఎమ్ఏహెచ్ కపాసిటీ.

 • poco x2

  Technology5, Feb 2020, 12:07 PM

  ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డుపై పోకో ఎక్స్2 కొంటే డిస్కౌంట్.. 11 నుంచి రెడీ

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ నుంచి విడివడి స్వతంత్ర బ్రాండ్ ఏర్పరుచుకున్న పొకో విపణిలోకి రెండో మోడల్ ఫోన్ ఎక్స్2ను విడుదల చేసింది. ఇది ఈ నెల 11వ తేదీ నుంచి ఫ్లిప్ కార్టులో అందుబాటులోకి రానున్నది. 

 • xiaomi note 10 launch

  Gadget7, Jan 2020, 2:48 PM

  షియోమీ నుండి కొత్త ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్...?

  షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫొన్ల ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి 108 ఎంపీ ప్రైమరీ లెన్స్​, 66 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకురాని షియోమీ ఇక ముందు ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.
   

 • real me new app paisa app

  Technology18, Dec 2019, 11:31 AM

  షియోమీతో ‘టగ్ ఆఫ్ వార్’: ఆర్థిక సేవల్లోకి రియల్‌మీ

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు షియోమీ, రియల్ మీ, వన్ ప్లస్ వివిధ రకాల సేవల్లో పోటీ పడుతున్నాయి. తాజాగా చౌక ఫోన్ల తయారీ సంస్థ షియోమీతో రియల్ మీ ఆర్థిక సేవలందించేందుకు సిద్ధమైంది. అందుకోసం పైసా యాప్‌ ఆవిష్కరించింది. రూ.1 లక్ష దాకా వ్యక్తిగత రుణాలివ్వడంతోపాటు కస్టమర్లకు వచ్చే ఏడాది నుంచి ఉచిత క్రెడిట్‌ రిపోర్ట్స్, ఇతర సేవలను అందుబాటులోకి తేనున్నది.

 • infinix smart tv launch soon

  Technology16, Dec 2019, 12:36 PM

  షియోమీ, వన్‌ప్లస్ లాగే ‘స్మార్ట్ టీవీల్లోకి’ ఇన్ఫినిక్స్

  షియామీ, వన్‌ప్లస్, మోటోరోలా వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. స్మార్ట్ టీవీల ఉత్పత్తిలోకి రాగా, ఈ జాబితాలో తాజాగా హాంకాంగ్ ఆధారిత సంస్థ ఇన్ఫినిక్స్ చేరింది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో భారతీయ మార్కెట్‌లోకి స్మార్ట్ టెలివిజన్లను తేవాలన్న లక్ష్యంతో ఇన్ఫినిక్స్ ముందుకెళ్తున్నది.

 • xiaomi note 10 launch

  Technology26, Nov 2019, 10:27 AM

  షియోమీ నుండి అదిరిపోయే ఫీచర్లతో మరో ఎంఐ కొత్త ఫోన్​...

  చైనా మొబైల్​ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ భారత వినియోగ దారులకు 108 ఎంపీ కెమెరా గల ఎంఐ నోట్​10 ఫోన్లను తీసుకురానున్నది. ఈ సంగతి సంస్థ భారత్ అధిపతి మను కుమార్ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు​. గత నెలలోనే గ్లోబల్ విపణిలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది షియోమీ. తన ప్రత్యర్థి వన్ ప్లస్ ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనున్నదని తెలుస్తోంది.
   

 • xiaomi red mi note 7s blast

  Technology22, Nov 2019, 12:02 PM

  షియోమీ రెడ్‌మీ.. ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. లేదంటే ...?

  ఆఫీసులో టేబుల్ పై పెట్టిన రెడ్ మీ నోట్ 7 ఎస్ ఫోన చార్జింగ్ లేకుండానే పేలిపోయింది. ఇది కస్టమర్ పొరపాటు వల్లే జరిగి ఉంటుందని షియోమీ పేర్కొంది. షియోమీ మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్‌ తప్పిదం వల్లే ఇలా జరిగి ఉంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది.