రఫెల్ నాదల్
(Search results - 7)tennisOct 11, 2020, 9:50 PM IST
French Open 2020: రఫెల్ ‘బుల్’ రికార్డు విక్టరీ... జోకోవిచ్‌కి షాక్ ఇచ్చిన నాదల్...
స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ చేరింది. మట్టి కోర్టులో చెలరేగిపోయే రఫెల్ నాదల్ జోరు ముందు సెర్భియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ నిలవలేకపోయాడు. కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ గెలిచిన రఫెల్ నాదల్‌కి, ఇది 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. కెరీర్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేశాడు రఫెల్ నాదల్.
tennisOct 6, 2020, 5:04 PM IST
మ్యాచ్ ఓడి... ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు... అరుదైన దృశ్యం...
ప్రతీ ఆటలో గెలుపు ఓటములు సహజం. విజయం కోసం కసిగా పోరాడే ఆటగాడు, ప్రత్యర్థి ఆటగాడిని కొన్ని సందర్భాల్లో శత్రువుగా భావిస్తాడు కూడా. అయితే తనను ఓడించిన ప్రత్యర్థి ఆటోగ్రాఫ్ తీసుకుని, జ్ఞాపకంగా మలుచుకున్నాడు టెన్నిస్ ప్లేయర్ సెబాస్టియర్ కోర్డా. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్లో ఎదుర్కొన్న కోర్డా... 1-6, 1-6, 2-6 తేడాతో ఓడిపోయాడు.
tennisJan 24, 2020, 3:16 PM IST
బాల్‌గాళ్‌ను తాకిన షాట్: ముద్దుచ్చి ప్రేమ కురిపించిన రఫెల్ నాదల్
స్పెయిన్ టెన్నిస్ సూపర్‌స్టార్ రఫెల్ నాదల్ తన మనసు ఎలాంటిదో ప్రపంచానికి చూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భాగంగా నాదల్ గురువారం మ్యాచ్ ఆడుతున్నాడు.
tennisOct 20, 2019, 3:57 PM IST
14 ఇయర్స్ లవ్: ఒక ఇంటివాడైన టెన్నిస్ స్టార్ రఫా
స్పెయిన్ టెన్నిస్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 14 సంవత్సరాల క్రితం పరిచయమైన షిస్క పెరెల్లో ను పెళ్లాడాడు. కేవలం కొద్దీ మంది దగ్గర వ్యక్తుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సంబంధించి ఎటువంటి ఫోటోలు బయటకు రాలేదు.
tennisSep 9, 2019, 7:27 AM IST
యూఎస్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్..ఫెదరర్ రికార్డుకు అడుగు దూరంలో
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్యా క్రీడాకారుడు డానియల్ మెద్వెద్వెన్పై 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో విజయం సాధించాడు. తద్వారా కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
tennisJun 10, 2019, 8:06 AM IST
ఫ్రెంచ్ ఓపెన్ విజేత రఫెల్ నాదల్
ఫ్రెంచ్ ఓపెన్-2019 విజేతగా రఫెల్ నాదల్ అవతరించాడు. ఫైనల్లో 6-3, 5-7,6-1, 6-1 తేడాతో డొమ్నిక్ థీమ్‌పై నాదల్ విజయం సాధించాడు. తద్వారా 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచినట్లయ్యింది. కెరీర్లో నాదల్కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్.
tennisJan 27, 2019, 4:31 PM IST
రఫెల్ నాదల్ ఓటమి...ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్
ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సెర్బియా ఆటగాడు జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. రఫెల్ నాదల్‌తో జరిగిన ఫైనల్లో 6-3, 6-2, 6-3 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. ఈ విజయంతో జకోవిచ్ 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, నాదల్ 17 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో రెండో స్థానంలో ఉన్నాడు.