బీఎస్‌ఎన్‌ఎల్‌  

(Search results - 10)
 • business19, Feb 2020, 3:47 PM

  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసుల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్లు...

  ఈ‌ఈ‌ఎస్‌ఎల్ 1000 బిఎస్ఎన్ఎల్ సైట్లలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను దశలవారీగా ఏర్పాటు చేయనుంది. అర్హతలు ఉన్న సిబ్బందిని నియమించి ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నిర్వహణ, నిర్వహణతో పాటు, అవగాహన ఒప్పందానికి సంబంధించిన సేవలపై ముందస్తుగా పెట్టుబడులను ఇఇఎస్ఎల్ పెట్టనుంది.

 • BSNL and MTNL have opted for voluntary

  Technology4, Dec 2019, 10:16 AM

  బీఎస్ఎన్ఎల్ & ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ పథకానికి ఫుల్ డిమాండ్

  కేంద్ర టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ల్లో పని చేస్తున్న వారిలో సుమారు 92,700 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సంస్థలపై ఏటా రూ.8,800 కోట్ల వేతన బిల్లు భారం తగ్గనున్నది. 

 • bsnl 4g is here

  Technology25, Nov 2019, 12:21 PM

  బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవల విస్తరణ... 70వేల చోట్ల 4జీ సేవలు...

  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఈ నెలాఖరు నాటికి 50 వేల 4జీ లైన్ ఎక్విప్‌మెంట్స్ కోసం టెండర్లు పిలువనున్నట్లు ప్రకటించింది. 

 • bsnl 80 tousand employees in vrs

  Technology21, Nov 2019, 1:41 PM

  బీఎస్ఎన్ఎల్ @ దాదాపు 78 వేల మంది...దరఖాస్తు

  బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల విలీనానికి రెండేళ్ల గడువు పడుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అంత వరకు బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థగా కొనసాగుతుందన్నారు. ఇక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కలిపి 91 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందికి రూ.90 లక్షల మేరకు లబ్ధి చేకూరుతుందని అంచనా.  

 • business14, Oct 2019, 12:40 PM

  బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా?

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కన్నా మూసివేతకే కేంద్ర ఆర్థిక శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆ రెండు సంస్థల ఉద్యోగులు ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు. 
 • bsnl

  TECHNOLOGY24, Jul 2019, 4:00 PM

  తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

  ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

 • amit shah

  News17, Jul 2019, 6:05 PM

  వీఆర్ఎస్ ప్లస్ రివైవల్: ‘షా’ చేతిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యూచర్

  నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీఎస్ఎన్‌ఎల్‌ను సత్వరమే ఆదుకునేందుకు మంత్రుల బృందం రూ.1,000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బడ్జెటరీ కేటాయింపులకు త్వరలో మంత్రుల బృందం ఆమోదం తెలపనుందని సమాచారం. 
   

 • bsnl

  TECHNOLOGY5, Apr 2019, 12:18 PM

  బీఎస్‌ఎన్‌ఎల్‌కు బెయిలౌట్.. పీఎంఓ ఓకే.. ఇండియాలో నో జాబ్స్ అన్న ఫిచ్

  ప్రైవేట్ మోజులో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దాని అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ఉద్యోగులపై మాత్రం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తున్నది.

 • bsnl

  TECHNOLOGY4, Apr 2019, 10:56 AM

  అంపశయ్యపై బీఎస్‌ఎన్‌ఎల్‌: 54 వేల మందికి ‘వీఆర్ఎస్’

  ఒకనాడు భారతదేశం నలు చెరగులా చరవాణిగా సేవలందించిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పూర్తిగా అంపశయ్యపై ఉంది. అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నా.. ప్రైవేట్ పట్ల మోజుతో పాలకులు స్పెక్ట్రం కేటాయింపులు, రీచార్జింగ్ ఫెసిలిటీస్ కల్పించడంలో సాచివేత ధోరణి అవలంభించడం కూడా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కష్టాలకు కారణంగా కనిపిస్తున్నది. దీనికి తోడు రెండేళ్ల క్రితం 4జీతో సంచలనాలకు దిగిన రిలయన్స్ జియో కూడా ఒక కారణమే ఫలితంగా ఎకాఎకీన 54 వేల మందికి పైగా ఉద్యోగులకు ‘స్వచ్ఛంద పదవీ విరమణ’ కింద రిటైర్మెంట్ వయో పరిమితి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీని అమలు కోసం ఎన్నికల సంఘం ఆమోదం కోసం టెలికం శాఖ ఎదురు చూస్తోంది. 

 • News16, Mar 2019, 2:22 PM

  మూసివేత దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌: ఇక తేల్చుకోవాల్సింది కేంద్రమే

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ మూసివేత దశగా అడుగులేస్తున్నది. ప్రైవేట్ ప్రొవైడర్లతో పోటీ పడేందుకు వెసులుబాటు కల్పించకుండా సర్కార్ సవతి ప్రేమ ఒక వంతైతే.. నిధుల సమకూర్చేందుకు గానీ, పోటీ పడేందుకు అనుమతించక పోవడం మరో సమస్య. ప్రైవేట్ సంస్థలకు స్పెక్ట్రం చెల్లింపులకు వాయిదాల పద్దతిని అనుమతించిన కేంద్రం.. బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఆ అవకాశం ఇవ్వకపోవడమే అసలు సమస్యలకు కారణం. వాస్తవాలను కప్పిపెట్టి.. సంస్థ నష్టాల పాలవుతున్నదని, మొత్తం వేతన భత్యాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లకే ఖర్చు చేయాల్సి వస్తున్నదని నిర్ధారణకు వచ్చింది. తాజాగా కొటక్ ఇనిస్ట్యూషనల్ ఈక్విటీస్ అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు నిధులు సమకూర్చి నిలబెట్టడమా? మూసేయడమా? అన్న అంశాలను తేల్చుకోవాలని కేంద్రానికి కోటక్‌ ఈక్విటీస్‌ నివేదిక స్పష్టం చేసింది.