ఫ్లిప్‌కార్ట్  

(Search results - 37)
 • TECHNOLOGY12, Jul 2019, 10:44 AM IST

  యాక్సిస్ ప్లస్ మాస్టర్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌ ‘క్రెడిట్‌ కార్డ్‌’


  ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ చెల్లింపుల సంస్థ మాస్టర్ కార్డుల సహకారంతో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును జారీ చేసింది. 

 • Flipkart

  TECHNOLOGY29, May 2019, 11:59 AM IST

  ఒకటి నుంచి ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్:31 వరకు ఐఫోన్‌పై రూ.25వేలు తగ్గింపు

  ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఈ నెల 27 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు రకరకాల ఆఫర్లను వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఇచ్చే డిస్కౌంట్ సేల్స్‌లో 80 శాతం వరకు ధరలో రాయితీ లభిస్తుంది. ఈ నెల 27-31 మధ్య సాగే మరో ఆఫర్ కింద ఐఫోన్ల నుంచి మిగతా ఫోన్ల ధరలు రూ.25 వేల నుంచి రూ.5000 వరకు తగ్గించి కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది.

 • e commerce

  TECHNOLOGY23, May 2019, 1:19 PM IST

  ‘స్నాప్ డీల్’ శిఖలోకి షాప్‌క్లూస్: అదే జరిగితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ జోడీగా..

  దేశీయ ఈ-కామర్స్ సంస్థల్లో ఒక్కటైన షాప్ క్లూస్‌ను టేకోవర్ చేసేందుకు స్నాప్ డీల్ చర్చలు జరుపుతోంది. దాదాపుగా స్నాప్ డీల్ లో షాప్ క్లూస్ విలీనం ఖరారైనట్లే. అయితే స్నాప్ డీల్ సంస్థలో షాప్ క్లూస్ వాటాదారులకు ఇచ్చే షేర్లు, వ్యవస్థాపకులకు నగదు చెల్లింపులపైనే చర్చ సాగుతోంది.

 • RIL

  business23, May 2019, 1:08 PM IST

  జియో ‘రిటైల్’ విధ్వంసక డిస్కౌంట్స్‌: అమెజాన్‌, వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌కు షాక్‌


  ఆన్‌లైన్‌ దిగ్గజాలు అమెజాన్, వాల్ మార్ట్ ప్లస్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు ‘రిలయన్స్ రిటైల్’ గుబులు పట్టుకోనున్నది.  త్వరలో మార్కెట్లోకి  రిలయన్స్‌ రిటైల్‌ కమర్షియల్‌ యాప్‌ అందుబాటులోకి రానున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్.. జియో తరహాలోనే వినియోగదారులకు మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అదే జరిగితే అమెజాన్, వాల్ మార్ట్ ప్లస్ ఫ్లిప్ కార్ట్ సంస్థలకు గట్టి ఎదురు దెబ్బ తగలనున్నదని ఫోర్రెస్టర్ సంస్థ అంచనా వేసింది. 

 • Flipkart Big Shopping Days Sale

  News10, May 2019, 4:50 PM IST

  ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

  ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో మరోసారి భారీ ఆఫర్లను మన ముందుకు తీసుకొస్తోంది. మే 15-19 వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, కెమెరాలు, స్పీకర్లు, ఇతర పరికరాలపై ఆఫర్లున్నాయి. 

 • Flipkart Summer Carnival

  business4, May 2019, 5:41 PM IST

  ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ కార్నివాల్ షురూ: టాప్ ఆఫర్లు ఇవే..

  ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పటికే సమ్మర్ సేల్స్ అంటూ మే 4-7 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సమ్మర్ కార్నివాల్ పేరుతో మే 4 నుంచి 7 వరకు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తోంది.
   

 • credit cards

  business3, May 2019, 4:36 PM IST

  ఇక ఫ్లిప్‌కార్ట్, ఓలా క్రెడిట్ కార్డులూ వచ్చేస్తాయి!

  ఇ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా క్రెడిట్ కార్డుల రంగంలోకి దిగేందుకు కసరత్తులు ప్రారంభించాయి. పెద్ద బ్యాంకుల సౌజన్యంతో ఈ సంస్థలు తమ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. 
   

 • mukesh ambani

  business2, May 2019, 9:58 AM IST

  ఫ్లిప్‌కార్ట్+అమెజాన్‌లకు పెను సవాల్: రిలయన్స్‘సూపర్ యాప్’

  ఒకే యాప్‌లో 100కి పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సదరు యాప్ డిజైన్ చేస్తోంది. అది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కాగలదు.  
   

 • Flipkart Super Value Week Sale

  GADGET25, Apr 2019, 1:46 PM IST

  ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు

  ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘సూపర్ వాల్యూ వీక్’ పేరిట పలు స్మార్ట్‌ఫోన్ల భారీ తగ్గింపులను ప్రకటించింది. ముఖ్యంగా హానర్ కంపెనీకి చెందిన 10ఫోన్లపై తగ్గింపు ధరను అందిస్తోంది. ఇతర ఫోన్లపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది. 

 • Flipkart

  business23, Apr 2019, 10:52 AM IST

  మెరుగైన సేవలు: హైదరాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ 2వ డేటా సెంటర్

  ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్ నగరంలో తన రెండో డేటా కేంద్రాన్ని ప్రారంభించింది. మొదటి డేటా సెంటర్ ముంబైలో ఉంది. డేటా సేవల సంస్థ కంట్రోల్ ఎస్ సహకారంతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను  నెలకొల్పినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

 • oyo

  TECHNOLOGY4, Apr 2019, 10:33 AM IST

  ఫ్లిప్‌కార్ట్‌లో కొలువంటే ఇండియన్స్‌కెంతో ఇదీ.. వాటిల్లోనూ

  భారతీయుల్లో అత్యధికులు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో పని చేయడానికి ఇష్ట పడుతున్నారు. అలాగే ఓయో సంస్థ ఉద్యోగులతోపాటు స్విగ్గీ, జొమాటో సంస్థల సిబ్బంది.. టీసీఎస్, రిలయన్స్ ఉద్యోగులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని లింక్డ్ ఇన్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. 

 • amazon

  business26, Mar 2019, 1:08 PM IST

  అమెజాన్‌/ ఫ్లిప్‌కార్ట్ ఫోన్ ఫెస్ట్: ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షం

  ఆన్ లైన్ రిటైల్ మేజర్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ భారతీయ కస్టమర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో సోమవారం నుంచి ఈ నెల 28 వరకు స్మార్ట్ పోన్ల కొనుగోళ్లపై పలు రకాల రాయితీలను ప్రకటించాయి. 

 • reliance

  business9, Mar 2019, 10:41 AM IST

  ఈ- కామర్స్‌లోకి రిలయన్స్ : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు ఛాలెంజ్

  జియో రంగ ప్రవేశంతో టెలికం రంగాన్నే షేక్ చేసిన ముకేశ్ అంబానీ.. ‘ఈ-కామర్స్’ రిటైల్ రంగంలో అడుగు పెట్టడం ద్వారా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలకు సవాల్ విసరనున్నారు. 

 • womens day

  GADGET6, Mar 2019, 1:21 PM IST

  ‘ఉమెన్స్ డే’ స్మార్ట్ బొనాంజా: ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు

  మహిళలు ఆకాశంలో సగం అంటారు.. ఆ అవకాశాన్ని ఈ- కామర్స్ మేజర్ ‘ఫ్లిప్‌కార్ట్’సద్వినియోగం చేసుకోతలపెట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన వినియోగదారులకు భారీగా డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్లపై రూ.2000 డిస్కౌంట్లతోపాటు ల్యాప్ టాప్ కంప్యూటర్లు, టాబ్లెట్లు అతి తక్కువ ధరలకే వినియోగదారులకు లభించనున్నాయి. మరీ మీరు త్వర పడండి.. డీల్ చేసుకోండి..

 • Amazon Flipkart

  TECHNOLOGY5, Mar 2019, 1:44 PM IST

  ఆమెజాన్ వర్సెస్ ఫ్లిప్‌కార్ట్: ఎవరికేది బెనిఫిట్.. 9లోగా జవాబివ్వాలి

  సంప్రదాయ వర్తకుల ఆందోళనను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ-కామర్స్‌పై ముసాయిదాను ప్రకటించింది. ఈ ముసాయిదాపై ఈ నెల తొమ్మిదో తేదీలోగా సదరు ఈ-కామర్స్ సంస్థలు అభిప్రాయాలు చెప్పడానికి కసరత్తు చేస్తున్నాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఈ-కామర్స్‌లో మరింత పారదర్శకతకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.