పవర్ స్టార్
(Search results - 233)EntertainmentJan 17, 2021, 7:37 PM IST
ఇంకో సినిమా కమిటైన పవన్ కళ్యాణ్
చాలాకాలం తర్వాత తిరిగి మేకప్ వేసుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల వేగం పెంచారు. ఆయన నటిస్తున్న ‘వకీల్‌సాబ్’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే తర్వాతి సినిమాకు పనిచేసేందుకు సిద్ధమయ్యారాయన. #PSPK27 అనే వర్కింగ్ టైటిల్‌తో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర యూనిట్‌తో వపన్ కలవనున్నారు.
EntertainmentJan 13, 2021, 4:24 PM IST
క్రాక్ మూవీ కేక అంటున్న చరణ్
విడుదలైన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న క్రాక్ మూవీ గురించి చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రాక్ మూవీ సూపర్ అంటూ కితాబు ఇచ్చాడు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు.
EntertainmentJan 11, 2021, 2:04 PM IST
‘క్రాక్’ ఎఫెక్ట్ : కంగారుపడుతున్న పవన్ ఫ్యాన్స్?
పవన్ కల్యాణ్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్లో మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయినట్టు చిత్ర టీమ్ తెలియచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అదే సమయంలో సినిమా ప్రచారంకు కూడా తెర తీస్తున్నారు.
EntertainmentJan 9, 2021, 6:48 PM IST
‘వకీల్ సాబ్’, ‘ఆచార్య’ : మెగా ఇండస్ట్రీ హిట్ డేట్స్ కే ఫిక్స్
2021కి తెలుగులో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘వకీల్ సాబ్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల విరామం తర్వాత రాబోతున్న సినిమా ఇది. కరోనా లేకుంటే ఈ ఏడాది వేసవిలోనే సందడి చేయాల్సిన చిత్రమిది. వైరస్ తెచ్చిన విరామం వల్ల ఈ సినిమా పూర్తి కావడం ఆలస్యమైంది. ఈ సినిమాని చిరంజీవి సూపర్ హిట్ ఘరానా మొగడు రిలీజ్ రోజైన ఏప్రియల్ 9న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
EntertainmentJan 1, 2021, 8:09 AM IST
అభిమానులు, ప్రజానికానికి చిరంజీవి, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ విషెస్.. బోల్డ్ మెసేజ్
మన జీవితంలోకి ఎన్నో కష్టాలను తీసుకొచ్చి, మనకో గుణపాఠాలను, అనుభవాలను మిగిల్చిన 2020కి గుడ్‌బై చెబుతున్నాడు సెలబ్రిటీలు. అదే సమయంలో 2021కి ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, వరుణ్ తేజ్ కొత్త సంవత్సర సందేశాన్ని అందించారు.
EntertainmentDec 31, 2020, 1:09 PM IST
‘వకీల్‌సాబ్’ లాస్ట్ మినిట్ ఛేంజెస్,వాటిని వద్దనుకున్నారు?
మొదట పింక్ సినిమాలో హీరోయిన్ ట్రాక్లేదు. కానీ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సీన్స్ ని పెట్టారు. కొన్ని రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ పవన్, శృతిహాసన్ పై ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత రకరకాల చర్చించిన తర్వాత పొల్లాచ్చిలో పవన్, శృతిహాసన్ లపై చిత్రీకరించాల్సిన డ్యూయిట్ ని డ్రాప్ అయినట్లు సమాచారం. ఆ సాంగ్ కనుక పెడితే కథలో జరిగే కొన్ని ప్రొసిడింగ్స్ ని డిస్ట్రబ్ చేస్తుందని ఫీల్ అయ్యారట. అంతేకాకుండా సెకండాఫ్ లో నడిచే సీన్స్ ల మధ్య ఉండే సీరియెస్ నెస్ కూడా తగ్గుతుందని భావించి వద్దనుకున్నారట. దాంతో పవన్ ని మొదట అనుకున్న సమయం కన్నా ముందే షూట్ ఫినిష్ చేసి పంపేసారని చెప్పుకుంటున్నారు.
EntertainmentDec 30, 2020, 7:09 AM IST
సాబ్..షూటింగ్ ఫినిష్ చేసి ఫలితం ఏముంది?
త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది. అయితే ఇప్పుడు మళ్లీ సినిమా ప్రారంభమై పరుగులు పెట్టింది.
EntertainmentDec 7, 2020, 7:15 PM IST
చిరంజీవి నిహారిక పెళ్ళికి ఏం గిప్ట్ ఇస్తున్నాడో తెలుసా..
నిహారిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఉదయ్‌పూర్ చేరుకున్నారు.
EntertainmentDec 5, 2020, 12:57 PM IST
పవర్, మహేష్ ఫ్యాన్స్ ఊగిపోయే అప్డేట్.. అదే నిజమైతే బాక్సాఫీస్‌కి పూనకమే
తాజాగా అలాంటి అరుదైన సన్నివేశం చోటు చేసుకోబోతుందట. దానికి మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` వేదిక కాబోతుందని తెలుస్తుంది. మహేష్ హీరోగా, పరశురామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తుంది.
EntertainmentNov 22, 2020, 7:48 AM IST
పవన్ హామీతో ప్రశాంతగా పెళ్లికి సిద్ధం అవుతున్న నిహారిక
నిహారిక నిశ్చితార్ధ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. నిహారిక నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. అదే సమయంలో జరిగిన నితిన్ పెళ్ళికి వెళ్లిన పవన్...నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకకు రాలేదు. కారణాలేమైనా కానీ కూతురు నిశ్చితార్థ వేడుకకు పవన్ రాకపోవడం ఒకింత వెలితిగా అనిపించింది.
EntertainmentNov 5, 2020, 8:19 AM IST
పవన్ తో శ్రీముఖి సెల్ఫీ..వెనక అసలు విషయం ఇదా?
. ‘ఏం టైప్ చేయాలో తెలియడం లేదు. పవన్ కల్యాణ్ సర్.. లవ్.. లవ్.. లవ్’ అని శ్రీముఖి సంబరపడిపోయారు. పవన్ కళ్యాణ్ క్లీన్ షేవ్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ప్రక్క పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా షూట్ బ్రేక్‌లో జనసేన పార్టీ పనులు చూసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
EntertainmentNov 4, 2020, 4:10 PM IST
పవన్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చే న్యూస్
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల వెనకబడింది.
EntertainmentNov 2, 2020, 1:43 PM IST
లీక్ చేస్తే జైలు శిక్షే : ‘వకీల్ సాబ్’ నిర్మాతల పిటిషన్?
ముందే లుక్ లీక్ అయ్యిపోతే ఇంక తాము పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ కిక్ ఏముంటుందనేది వారి వాదన. అందుకోసం వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ టీమ్ లో ఎవరో ఒకరి అత్యుత్సాహం దెబ్బతీస్తోంది. ఇప్పుడు వకీల్ సాబ్ కు ఇదే సమస్య ఎదురౌతోంది.
EntertainmentOct 29, 2020, 7:47 AM IST
‘వకీల్ సాబ్’:భారీ రేటుకు శాటిలైట్ రైట్స్ ,కానీ ఒక కండీషన్?
ఓటీటీల్లో కొత్త సినిమా రిలీజవడం అవ్వగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసేస్తున్నారు. మధ్యలో యాడ్స్ తలనొప్పి లేకపోవటం, హెడ్ డీ క్వాలిటీ ఉండటం కలిసొస్తోంది. దీంతో ఆ తర్వాత టీవీలో సినిమా రిలీజైతే పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. ఆ మధ్య కాలంలో నవీన్ చంద్ర సినిమా ‘భానుమతి రామకృష్ణ’ , సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీవిల్లో కూడా ఆశించిన స్పందన లేదు. ఈ నేపథ్యంలో శాటిలైట్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవాలంటే ఇలాంటి ఓ కండీషన్ తప్పనిసరి అని భావిస్తున్నారట. ఇక వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ రూ. 15 నుంచి రూ. 17 కోట్ల వరకు రేటు ఫిక్సైనట్లు వినపడుతోంది.
EntertainmentOct 23, 2020, 7:08 AM IST
సినీ సాయంపై పవన్ దిమ్మతిరిగే కౌంటర్! ‘అత్తారింటికి దారేది’ టైమ్ లోనూ... |
చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తన శక్తి కొలది ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం ప్రకటించారు. అయితే ఎంతో డబ్బున్న చిత్ర పరిశ్రమ నుండి అందాల్సినంత సహాయం అందడంలేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలకు తాజాగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.