టీవీ9 మాజీ సీఈఓ  

(Search results - 10)
 • raviprakash

  Telangana17, Oct 2019, 1:47 PM IST

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

  టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
   

 • revanth reddy
  Video Icon

  Telangana7, Oct 2019, 6:10 PM IST

  చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్‌తో భేటీ తర్వాత (వీడియో)

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని రవిప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు . ప్రశ్నించేవారిని అణగదోక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 • ravi prakash

  Telangana6, Oct 2019, 10:57 AM IST

  మాట్లాడలేదు, నిద్రపోలేదు: జైల్లో మొదటి రోజు రవిప్రకాష్

  నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ శనివారం రాత్రి సాధారణ ఖైదీగా చంచల్‌గూడ జైలులో గడిపారు. కృష్ణా బ్యారక్‌లో రవిప్రకాష్ గడిపాడు. ఈ నెల 18వ తేదీ వరకు రవిప్రకాష్ కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో  ఆయనను శనివారం నాడు రాత్రి చంచల్‌ గూడ జైలుకు తరలించారు.

 • revanth raviprakash

  Telangana5, Oct 2019, 3:31 PM IST

  రవిప్రకాష్ కు చిక్కులు: రేవంత్ రెడ్డితో నయా దోస్తీ, హుజూర్ నగర్ లో వేలు

  హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను పోలీసులు కొద్దిసేపటి కింద అరెస్ట్ చేసారు.  పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీవీ9 చానెల్ కార్యాలయానికి వెళ్లినప్పుడు పోలీసుల విధులకు రవిప్రకాష్ ఆటంకం కలిగించారని అభియోగం

 • మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని,  ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.

  Telangana12, Jul 2019, 2:29 PM IST

  రవిప్రకాష్‌కు ఊరట: బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

  టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.

 • RAVI PRAKASH

  Telangana18, Jun 2019, 4:52 PM IST

  రవిప్రకాష్‌పై టీవీ9 కేసు: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

  ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో  ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కేసులో తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలను ధర్మాసనం వింది.
   

 • ravi prakash

  Telangana4, Jun 2019, 4:40 PM IST

  ఎట్టకేలకు పోలీసుల ముందుకొచ్చిన రవిప్రకాష్

  హైదరాబాద్: హైద్రాబాద్ సీసీఎస్ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మంగళవారం నాడు హాజరయ్యారు

 • బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.

  Telangana22, May 2019, 5:12 PM IST

  రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

   తమపై మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన  ఆరోపణలను టీవీ 9 కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు చేశారు

 • టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.

  Telangana22, May 2019, 2:55 PM IST

  తప్పుడు కేసులు: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్

  టీవీ9 కొత్త యాజమాన్యం తనపై తప్పుడు కేసులు బనాయించిందని  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆరోపించారు. కొత్త యాజమాన్యం ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఆయన విమర్శించారు. పత్రికా స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తానని ఈ విషయంలో  తనకు మద్దతు ఇవ్వాలని రవిప్రకాష్ కోరారు. 
   

 • ravi prakash

  Telangana10, May 2019, 9:55 PM IST

  కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

  టీవీ9 సీఈఓ పదవి నుండి తనను తొలగించడంపై మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆ సంస్థ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు సమావేశమై కొత్త సీఈఓగా మహీంద్రా మిశ్రాను, సీఓఓగా సింగారావును నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.