జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
(Search results - 75)TelanganaDec 7, 2020, 3:23 PM IST
నేరేడ్మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి గ్రీన్ సిగ్నల్: హైకోర్టు కీలక ఆదేశం
నేరేడ్మెట్ డివిజన్ పరిధిలో 544 బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలున్నాయి. ఈ ముద్రలను పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.
TelanganaDec 6, 2020, 5:39 PM IST
జమిలి ఎన్నికలొచ్చే ఛాన్స్, సిట్టింగ్‌లను మార్చని చోటే ఓటమి: కేటీఆర్
ఓడిపోయినవాళ్లని చులకనగా చూడొద్దని కేటీఆర్ కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి భావోద్వేగ ఎన్నికలు జరిగాయన్నారు. హైద్రాబాద్ లో కార్పోరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకొని నగర అభివృద్దికి పాటుపడాలని ఆయన సూచించారు.
TelanganaDec 6, 2020, 10:58 AM IST
ఢిల్లీకి బండి సంజయ్: జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత తొలిసారి హస్తినకు
గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఈ దఫా ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ సత్తా చాటింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. బీజేపీ అగ్రనేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
TelanganaDec 4, 2020, 4:15 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: కాంగ్రెస్‌కు బీజేపీ దెబ్బ
ఇదే ఊపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీలను వేసింది. ఈ కమిటీల ఏర్పాటుపై హైద్రాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల మధ్య సమన్వయం లేకుండా పోయింది.
TelanganaDec 4, 2020, 2:53 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో నిరుత్సాహపడొద్దు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. అనేక తప్పుడు వాగ్ధానాలతో టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు.
TelanganaDec 4, 2020, 2:32 PM IST
జీహెచ్ఎంసీ కౌంటింగ్: బోరబండ నుండి గెలుపొందిన డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్
ఈ దఫా ఇదే స్థానం నుండి ఫసియుద్దీన్ పోటీ చేసి గెలుపొందారు. గతంతో పోలిస్తే ఆయన ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారని సమాచారం. గత పాలకవర్గంలో డిప్యూటీ మేయర్ గా ఉన్న మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం నుండి విజయం సాధించారు. ఎంఐఎం అభ్యర్ధిగా ఆయన మెహిదీపట్నం నుండి పోటీ చేసి గెలుపొందారు.
TelanganaDec 4, 2020, 1:23 PM IST
మౌలాలి డివిజన్లో నిలిచిపోయిన కౌంటింగ్: బ్యాలెట్ బాక్సులో 33 ఓట్లు అధికం
ఈ డివిజన్లోని ఓ పోలింగ్ బూత్ లో పోలైన ఓట్ల కంటే 33 ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలింగ్ రోజున 361 ఓట్లు పోలయ్యాయి. కానీ బ్యాలెట్ బాక్సులో మాత్రం 394 ఓట్లు ఉన్నాయి.
TelanganaDec 4, 2020, 12:59 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు: హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్న టీఎస్ఈసీ
బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు కాకుండా పెన్నుతో పాటు టిక్ గుర్తు పెట్టినా కూడ వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నాడు రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది
TelanganaDec 3, 2020, 2:50 PM IST
టీపీసీసీ చీఫ్ మార్పుపై మరోసారి చర్చ: కొత్త సారధి వచ్చేనా?
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీ చీఫ్ పదవిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. గతంలో కూడా ఇదే రకమైన ప్రచారం కూడా సాగింది. అయితే ఇంకా పీసీసీ చీఫ్ ను మార్చలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
TelanganaDec 2, 2020, 6:14 PM IST
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు కనీసం వారం లేదా 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలన్నారు.ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు కరోనా పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు.
TelanganaDec 2, 2020, 1:08 PM IST
బండి సంజయ్‌కి మోడీ ఫోన్: జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై ఆరా
సుమారు 10 నిమిషాల పాటు మోడీ బండి సంజయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు బాగా పనిచేశారని మోడీ అభినందించారు. బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి మోడీ సంజయ్ ను అడిగి వివరాలు తెలుసుకొన్నారు.
TelanganaDec 1, 2020, 5:36 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: 14 డివిజన్లలో 5శాతం లోపు ఓటింగ్
కారణం ఏదో తెలియదు కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ కు ఓటర్లు ఆసక్తిని చూపలేదు. దీంతో కొన్ని డివిజన్లలో 5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే నమోదు కావడాన్ని చూస్తే ఓటింగ్ పట్ల ప్రజల అనాసక్తిని తెలుపుతోంది.
TelanganaDec 1, 2020, 4:25 PM IST
జాంబాగ్ డివిజన్లో ఉద్రిక్తత: ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం
ఎంఐఎం నేతలు దాడికి పాల్పడ్డారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ డివిజన్ లో పోలీసులు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని టీఆర్ఎస్ ఆరోపించారు.
TelanganaDec 1, 2020, 3:17 PM IST
TelanganaDec 1, 2020, 1:33 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: మాజీ ఎంపీ మల్లు రవి ఓటు గల్లంతు
ఆన్ లైన్ లో తమ ఓట్లు ఉన్నప్పటికీ కూడ ఫైనల్ ఓటరు జాబితాలో మాత్రం ఓట్లు లేకపోవడంతో ఓటర్లు షాక్ తిన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుత్సాహనికి గురయ్యారు.