గౌతమ్ గంభీర్
(Search results - 57)CricketJan 24, 2021, 9:14 AM IST
ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా గౌతమ్ గంభీర్... ఇక కామెంటరీలోనూ రచ్చ రచ్చే...
ఐపీఎల్లో అప్పుడెప్పుడో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, అవకాశం దొరికినప్పుడల్లా భారత సారథి విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీగా ఉంటాడు. ఇన్నాళ్లు స్పెషల్ ఇంటర్వ్యూల్లో, ట్విట్టర్లోనే ఇలాంటి కామెంట్లు చేసిన గౌతీ, ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్‌కి వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నాడు.
CricketJan 22, 2021, 1:34 PM IST
అతన్ని విడుదల చేయడం చాలా పెద్ద తప్పు... ఆర్సీబీ ప్లాన్ ఏంటో మరి!... గౌతమ్ గంభీర్ కామెంట్...
అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీ అయిపోతుంటాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గత సీజన్లో ఆర్సీబీ, నాలుగో స్థానానికే పరిమితమైన తర్వాత... ‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా పనికిరాడంటూ’ సంచలన వ్యాఖ్యాలు చేసిన గౌతీ, మరోసారి రాయల్ ఛాలెంజర్స్‌ను ట్రోల్ చేశాడు.
CricketJan 16, 2021, 6:01 AM IST
బుమ్రాకి అది చాలా అవసరం... ఇంగ్లాండ్ సిరీస్‌కి దూరంగా పెట్టండి... గౌతమ్ గంభీర్ కామెంట్...
బుమ్... బుమ్... బుమ్రా... భారత జట్టులో అత్యంత కీలకంగా మారిన స్టార్ బౌలర్. రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్లు కేవలం టెస్టు సిరీస్‌లకి మాత్రమే పరిమితం కాగా జస్ప్రిత్ బుమ్రా మాత్రం టీ20, వన్డే, టెస్టు అనే తేడా లేకుండా అన్ని ఫార్మాట్లలోనూ బరిలో దిగుతున్నాడు. ఐపీఎల్ 2020 నుంచి మహా బిజీగా ఉన్న బుమ్రాకి వచ్చే ఇంగ్లాండ్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
CricketDec 24, 2020, 4:10 PM IST
విరాట్ లేడు, షమీ ఆడలేడు... రెండు రోజుల ఆధిపత్యం మనదే... టీమిండియాకి ఇది చాలు...
తొలి టెస్టులో ఘోర పరాజయం చెందినా... మొదటి రెండు రోజులు టీమిండియాదే ఆధిపత్యం అనే విషయాన్ని గుర్తుంచుకొని, భారత జట్టు రెండో టెస్టులో బరిలో దిగాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. గాయం కారణంగా మహ్మద్ షమీ మిగిలిన టెస్టు సిరీస్‌కి అందుబాటులో ఉండడం లేదని, విరాట్ కోహ్లీ కూడా లేడనే విషయాన్ని భారత జట్టు గుర్తుంచుకుంటే మంచి ఫలితాలు కచ్ఛితంగా సాధించవచ్చని చెప్పాడు గంభీర్.
CricketDec 22, 2020, 4:10 PM IST
బాక్సింగ్ డే టెస్టుకి భారత జట్టును ప్రకటించిన గౌతమ్ గంభీర్... ఏకంగా ఐదు మార్పులతో...
మొదటి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరాజయంతో కుదేలైన టీమిండియా, బాక్సింగ్ డే టెస్టు కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆసీస్ టూర్‌ను వరుసగా రెండు పరాజయాలతో ఆరంభించిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచింది. ఆఖరి టీ20తో పాటు మొదటి టెస్టు ఓడడంతో మళ్లీ విజయాల బాట పట్టాలని డిసైడ్ అయిన భారత జట్టుకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
CricketDec 5, 2020, 3:51 PM IST
కోహ్లీకి రూల్స్ వర్తించవా... విరాట్ పద్ధతి మార్చుకుంటే బెటర్... భారత కెప్టెన్‌పై వీరూ ఫైర్...
భారత జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ కలిసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరి రూట్ మారిపోయింది. కోహ్లీని ఇన్నాళ్లు గంభీర్ విమర్శిస్తూ వస్తే, అతన్ని సపోర్టు చేస్తూ వచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కోహ్లీకి హ్యాట్సాఫ్ అంటూ గంభీర్ కామెంట్ చేస్తే... కోహ్లీ కెప్టెన్సీపై ఫైర్ అయ్యాడు వీరేంద్ర సెహ్వాగ్.
CricketDec 4, 2020, 8:05 PM IST
2020లో మరో వింత... విరాట్ కోహ్లీని పొగిడిన గౌతమ్ గంభీర్... ‘హ్యాట్సాఫ్ అంటూ’...
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కి మధ్య ఉన్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీని ఛాన్స్ వచ్చినప్పుడల్లా తిడుతూ, విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ ఉంటాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్కమణ తర్వాత విరాట్ కెప్టెన్సీ తీసేయాలని, టీ20 కెప్టెన్సీ రోహిత్‌కి అప్పగించాలని ఎన్నో మాటలన్న గంభీర్... చాలారోజుల తర్వాత కోహ్లీని ప్రశంసించాడు.
CricketNov 30, 2020, 2:54 PM IST
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏంటో అర్థం కావడం లేదు... వాళ్లని ఎందుకు ఆడించలేదు..
ఆసీస్ టూర్‌ను వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలెట్టింది భారత జట్టు. బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నా, బౌలర్ల వైఫల్యం భారత జట్టును తెగ వెంటాడుతోంది. అయితే బౌలర్ల కంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా విఫలమయ్యాడనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యం భారత జట్టు ఓటమికి కారణమని అంటున్నాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
CricketNov 24, 2020, 11:07 AM IST
విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్... పార్థీవ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు...
ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ ఛాంపియన్ గెలిచి ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా నియమించాలని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో సహా చాలామంది డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్థీవ్ పటేల్ కూడా చేరిపోయాడు.
CricketNov 21, 2020, 1:13 PM IST
ఇద్దరు కెప్టెన్ల సంస్కృతి మనకి వర్కవుట్ కాదు... గంగూలీ, ధోనీలాగే విరాట్ కోహ్లీ కూడా... కపిల్ దేవ్ కామెంట్స్!
IPL 2020 సీజన్ తర్వాత టీ20 ఫార్మాట్లో భారత జట్టు కెప్టెన్సీ రోహిత్ శర్మకు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వకపోతే, అది భారత జట్టుకు చాలా నష్టం కలిగిస్తుందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ ఇద్దరు కెప్టెన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
CricketNov 17, 2020, 12:39 PM IST
రోహిత్ కెప్టెన్‌గా పనికి రాడు... టీమ్‌లో స్థానమే సరిగా లేదు, కెప్టెన్సీ ఎలా ఇస్తారు...
ఐపీఎల్ 2020 సీజన్లో టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, భారత కెప్టెన్సీ రేసులో నిలిచాడని వార్తలు షికార్లు చేశాయి. టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇవ్వకపోతే, అది టీమిండియాకు చాలా నష్టం కలిగిస్తుందని గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు చాలామంది మద్ధతు కూడా ప్రకటించారు. అయితే ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ మాత్రం రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
CricketNov 14, 2020, 1:51 PM IST
ఆర్సీబీ జట్టుతో రోహిత్ శర్మ టైటిల్ గెలవగలడా? గంభీర్‌కి కౌంటర్ ఇచ్చిన ఆకాశ్ చోప్రా...
IPL 2020 సీజన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో చీలికలు తీసుకొచ్చింది. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి భారత టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని కొందరు అభిమానులు తీవ్రంగా వాదిస్తుంటే, రోహిత్ శర్మదేం లేదు, అతనికి బలమైన జట్టు దొరికింది అంటూ మరికొందరు వాదిస్తున్నారు. ఈ చర్చ ఇప్పుడు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా మధ్య ఆసక్తికర ఫైట్‌కి దారి తీసింది.
CricketNov 12, 2020, 1:02 PM IST
రోహిత్ శర్మ టీమిండియాకి కెప్టెన్ కాకపోతే, అది మనకే నష్టం... గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు...
IPL 2020 సీజన్లో ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపి, ఏకంగా ఐదు టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ, టీమిండియాకి కెప్టెన్ కాకపోతే అతనికేమీ నష్టం జరగదని, భారత జట్టు చాలా కోల్పోతుందని హాట్ కామెంట్స్ చేశాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
CricketNov 7, 2020, 3:58 PM IST
విరాట్ కోహ్లీ నీ వల్ల కాదు, ఇకనైనా కెప్టెన్సీ నుంచి తప్పుకో... గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు...
IPL 2020 సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాత మారలేదు. 13 సీజన్లుగా టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకి మరోసారి నిరాశే మిగిలింది. అదృష్టం కొద్ది ఎలాగోలా ప్లేఆఫ్ చేరిన ఆర్సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి నాలుగోస్థానానికి పరిమితమైంది.
CricketNov 6, 2020, 4:46 PM IST
రిషబ్ పంత్కి అంత సీన్ లేదు... ధోనీతో పోల్చడం ఆపండి... గౌతమ్ గంభీర్ కామెంట్!
IPL 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్ భర్తీ చేయగల వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందిన రిషబ్ పంత్, 2020 సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రిషబ్ పంత్‌పై విమర్శల వర్షం కురిపించాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్.