గోల్డెన్ వీసా
(Search results - 1)businessMar 16, 2019, 12:07 PM IST
ఇంగ్లాండ్లో నీరవ్ మోదీ బిజినెస్...‘గోల్డెన్’వీసా సాయంతో
భారత్లో లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి శఠగోపం పెట్టి.. రమారమీ రూ.14 వేల కోట్లు కాజేసిన ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీ స్కామ్ బయటపడేలోగా దేశాన్ని విడిచి పారిపోయి న్యూయార్క్ నగరంలో తలదాచుకున్నాడు. ఇటీవల లండన్లో టెలిగ్రాఫ్ ప్రతినిధికి చిక్కడంతో ఆయన ఆచూకీ బయటపడింది. లండన్ నగరంలో వ్యాపార లావాదేవీలు జరిపేందుకు 20 లక్షల పౌండ్ల పెట్టుబడులు పెట్టి గోల్డెన్ వీసా సంపాదించాడు. ఆ వీసా పొందాకే ఆయన లండన్ నగరానికి వచ్చాడని తెలుస్తున్నది. అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్ముతో ఏమైనా చేయొచ్చనడానికి నీరవ్ మోదీ ఒక ఉదాహరణ కానున్నారు.