కృష్ణా  

(Search results - 186)
 • mahesh vitta

  News22, Oct 2019, 2:38 PM IST

  విన్నర్ రాహుల్.. కానీ రాజకీయాలు జరిగితే మాత్రం.. మహేష్ విట్టా కామెంట్స్!

  నిజానికి మహేష్ విట్టా 'బిగ్ బాస్ 2'కి వెళ్లాల్సిందట. కానీ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగ్ లో ఉండడంతో కుదరలేదట. 

 • construction workers demands for ten thousand rupees
  Video Icon

  Vijayawada21, Oct 2019, 5:58 PM IST

  video : ఎమ్మార్వో కార్యాలయల వద్ద భవన నిర్మాణ కార్మికులు ఆందోళన

  బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాల్లోని ఎమ్మార్వో కార్యాలయల వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. సామూహిక వినతి పత్రాల సమర్పణలో భాగంగా ర్యాలీగా తాసిల్దార్ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వెంటనే పదివేల రూపాయలను ప్రకటించాలని ఎమ్మార్వో కార్యాలయల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక, కూలి పనిలేక రోడ్ల మీద పడ్డామని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

 • Commemoration Day of Police Martyrs at visaka and krishna districts
  Video Icon

  Districts21, Oct 2019, 4:57 PM IST

  video :వ్యవస్థను గాడిలో పెట్టడానికి కృషి చేస్తున్న పోలీసులు

  విశాఖలో పోలీసు అమర వీరుల సంస్మరణ వేడుకలు ఘనంగా జరిగాయి.  బీచ్ రోడ్డులోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ కలసి గౌరవ వందనం చేసి  నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, వ్యవస్థను గాడిలో పెట్టడానికి పోలీసులు ఎంతగానో దోహదం చేస్తున్నారన్నారు. కృష్ణాజిల్లా తిరువూరులో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

 • Road mishap in krishna district lorry hits school bus
  Video Icon

  Vijayawada21, Oct 2019, 4:20 PM IST

  video : స్కూలు బస్సును ఢీ కొట్టిన లారీ, తప్పిన ప్రమాదం

  కృష్ణాజిల్లా, అవుటపల్లి వద్ద స్కూలు బస్సును లారీ ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులున్నారు. గన్నవరం రవీంద్రభారతి స్కూల్ బస్సును అవుటపల్లి వద్ద ఓ లారీ వెనకనుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనకభాగం దెబ్బతిన్నది. బస్సు అద్దాలు విరిగిపోయాయి. అయితే బస్సులోని విద్యార్థులకు ఎలాంటి గాయాలూ కాలేదు.

 • rtc strike

  Vijayawada20, Oct 2019, 6:10 PM IST

  tsrtc strike: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

  ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో కార్మికుడి గుండె ఆగిపోయింది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని తన నివాసంలో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ ఖాజామియా గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు.

 • sun rays falls on suryanarayana idol
  Video Icon

  Vijayawada18, Oct 2019, 5:15 PM IST

  video: సూర్యభగవానుడి పాదాలను తాకిన సూర్యకిరణాలు

  కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని  శ్రీ ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామీ దేవాలయంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సూర్యుడు తుల రాశిలోకి ప్రవేశించే సమయంలో ఆలయంలోని సూర్య భగవానుడి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. 180 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ సూర్యదేవాలయం రాష్ట్రంలోనే  అరుదైన సూర్యదేవాలయాల్లో రెండో పెద్ద దేవాలయం అని,  ప్రతి ఏడాది సూర్యడు దక్షిణాయనం, ఉత్తరాయణం లో ప్రవేశించే మాసాలలో ఈ ఆలయంలో స్వామీవారీ పై సూర్యకిరణాలు తాకుతాయని ఆలయ ధర్మకర్త వంశి తెలిపారు.

 • man accidentally fell in River Krishna
  Video Icon

  Vijayawada18, Oct 2019, 2:36 PM IST

  video: ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి...

  ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు. దిగువకు ప్రవహిస్తున్న నీటిలో పడి కొట్టుకుపోతూ, చేతులెత్తి కాపాడమని అరుస్తున్నాడు. అరుపులు విని ఆ వ్యక్తిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బ్యారేజీ వద్దకు చేరుకుని అతన్ని కాపాడారు.

 • child

  Vijayawada17, Oct 2019, 7:57 PM IST

  దారుణం .. కన్న కూతురిని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి

  కృష్ణా జిల్లాలోో ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురినే అమ్మకానికి పెట్టి రెడ్ హ్యాాండెడ్ గా పట్టుబడ్డాడు.  

 • Sujana Chowdary gandhi sankalpa yatra in Krishna Dist
  Video Icon

  Vijayawada17, Oct 2019, 7:00 PM IST

  video: గాంధీగారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారు : సుజనాచౌదరి

  గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు

 • demolition of illegal constructions on Krishna river banks
  Video Icon

  Vijayawada17, Oct 2019, 4:55 PM IST

  కరకట్ట వెంటున్న అక్రమనిర్మాణాల కూల్చివేత (వీడియో)

  కృష్ణానది కరకట్ట వెంట ఉన్న శైవక్షేత్రం అమీలో అక్రమంగా నిర్మించిన బాత్ రూమ్స్, క్యాంటీన్లను కూల్చివేశారు. అమరావతి, తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో ఈ అక్రమనిర్మాణాలను CRDA అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో 10 మంది లేబర్స్ తో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.

 • labor minister inaugurates ESI hospital at kanchikacherla
  Video Icon

  Vijayawada17, Oct 2019, 12:32 PM IST

  కంచికచర్లలో ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను ప్రారంభించిన కార్మికశాఖ మంత్రి (వీడియో)

  కృష్ణా జిల్లా కంచికచర్లలో ఏర్పాటుచేసిన ఈ ఎస్ ఐ హాస్పిటల్ ను కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు.

 • 12 members held with 280 kg cannabis in krishna district
  Video Icon

  Vijayawada17, Oct 2019, 12:15 PM IST

  280 కిలోల గంజాయిని పట్టుకున్న కృష్ణా జిల్లా పోలీసులు (వీడియో)

  కృష్ణాజిల్లా, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో, 280 కిలోలు గంజాయి పట్టుబడింది. ఓ టెంపోలో 240 కిలోలు, ఆర్టీసీ బస్సులో 40 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని గన్నవరం పోలీసు స్టేషన్ కి తరలించారు. ఒక మహిళ సహా 12 మందిని అరెస్ట్ చేశారు.

 • Former MLA tangirala sowmya starts hunger strike at nandigama in krishna district
  Video Icon

  Vijayawada16, Oct 2019, 12:00 PM IST

  నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిరహారదీక్ష (వీడియో)

  కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య నిరహర దీక్ష ప్రారంభించారు. అక్రమ ఇసుక రవాణాను నిరసిస్తూ సౌమ్య ఈ దీక్షను చేపట్టారు.టీడీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 • Gandhi sankalpayatra at jaggayyapeta
  Video Icon

  Vijayawada15, Oct 2019, 12:59 PM IST

  సుజనా చౌదరి గాంధీ సంకల్ప యాత్ర (వీడియో)

  జాతిపిత గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బిజేపి గాంధీ సంకల్పయాత్ర తలపెట్టింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి గాంధీ సంకల్ప యాత్ర ప్రారంబించాడు. జగ్గయ్యపేట పట్టణ పార్కులోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.

 • Video Icon

  Districts14, Oct 2019, 6:24 PM IST

  పిడుగుపాటుకు సెల్ ఫోన్ పేలి... (వీడియో)

  కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణం సత్యనారాయణ పురంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. పోలినేడి సత్యనారాయణ  అనే వ్యక్తి వర్షం వస్తుంటే తలదాచుకోవడానికి చెట్టుకిందికి చేరాడు. ఆ సమయంలో పిడుగు పడటంతో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.