కార్టూన్
(Search results - 307)CricketDec 20, 2020, 5:21 PM IST
నీ వల్ల అవుతుంది, వాళ్లకి ఆడడం రాదు... విమర్శకులకు పృథ్వీషా కౌంటర్...
ఆస్ట్రేలియా టూర్లో బీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు యంగ్ సెన్సేషనల్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన పృథ్వీ, మొదటి టెస్టులోనూ అదే పర్ఫామెన్స్ కంటిన్యూ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఈ పర్ఫామెన్స్ తర్వాత పృథ్వీషాపైన సోషల్ మీడియాలో బీభత్సమైన కార్టూన్స్, మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అయితే తనను విమర్శిస్తున్నవారికి ఓ కొటేషన్‌తో సమాధానం ఇచ్చాడు పృథ్వీషా... ‘నువ్వు ఓ పని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు నిన్ను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తుంటారు... దాని అర్థం నువ్వు ఆ పని చేయగలవు, వాళ్ల వల్ల అది కాదు...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టాడు 21 ఏళ్ల పృథ్వీషా.TelanganaNov 28, 2020, 9:30 PM IST
ఆయనో కార్టూన్ క్యారెక్టర్: బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటర్
బండి సంజయ్ ఓ కార్టూన్ క్యారెక్టర్ అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. శనివారం ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్‌ను చాలా చూశామన్నారు
Cartoon PunchNov 16, 2020, 1:41 PM IST
కార్టూన్ పంచ్: వర్మ స్టైల్ దివాళి... పటాకులతో పాటు మాటలు పేలుస్తూ
హైదరాబాద్: దిపావళి పండగ సందర్భంగా వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వంతుగా కాలుష్యం పెరగడానికి సహకరిస్తున్నానంటూ టపాసులతో పాటు మాటలు పేల్చాడు వర్మ. అలాగే దీపావళిని అజాగ్రత్తగా జరపుకోవాలని... మీ మొహం, కాళ్లు చేతులు కాల్చుకోండంటూ తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు వినిరాడు వర్మ.
Cartoon PunchNov 5, 2020, 6:22 PM IST
కార్టూన్ పంచ్: బయటే కాదు ఇంట కూడా పరాభవమే... ఓటమి అంచుల్లో ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఎవరనే విషయం ఇంకా తేలలేదు కానీ ఫలితాల సరళిని చూస్తే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కంటే అధిక్యంలో ఉన్నాడు. బైడెన్ కు 264 ,ట్రంప్‌న కు 214 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. విజయానికి ఆరు ఎలక్టోరల్ ఓట్ల దూరంలో బైడెన్ ఉన్నాడు. 270 ఎలక్టోరల్ ఓట్లు దక్కితే అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక అవుతారు. సొంత రాష్ట్రం న్యూయార్క్ లోనూ ట్రంప్ కు పరాభవం తప్పలేదు.
TelanganaNov 4, 2020, 6:41 PM IST
కార్టూన్ పంచ్: తెలుగురాష్ట్రాల్లో ఆర్టీసి రైట్ రైట్
హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమక్షంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కొత్త ఒప్పందంపై సంతకాలు చేశారు.
Cartoon PunchNov 3, 2020, 7:45 AM IST
కార్టూన్ పంచ్: దుబ్బాక ఉపఎన్నికల్లో భారీ నగదు
సిద్దిపేట: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాలమృతితో దుబ్బాకలో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీట్ కోసం టీఆర్ఎస్, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. దీంతో దుబ్బాకలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను మభ్య పెట్టేందుకు భారీగా నగదును సిద్దం చేసుకోగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కోట్లల్లో నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
INTERNATIONALOct 31, 2020, 12:18 PM IST
చిన్నారులకు మహమ్మద్ ప్రవక్త నగ్నచిత్రాలు చూపించిన టీచర్.. సస్పెన్షన్...
పదేళ్లలోపు చిన్నారులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్లను చూపించిన ఓ టీచర్ సస్పెండ్ అయిన ఘటన బెల్జియంలో జరిగింది. వివరాల్లోకి వెడితే.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని మోలెన్బీక్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఓ టీచర్ ఆరో తరగతి విద్యార్థులకు మహ్మద్ ప్రవక్త నగ్న కార్టూన్ని చూపించాడని తెలిసింది.
INTERNATIONALOct 27, 2020, 8:48 PM IST
అక్కడ రాయబారే లేడు: నిరసన తెలపబోయి తప్పులో కాలేసిన పాకిస్తాన్
మహమ్మద్ ప్రవక్త కార్టూన్లను చూపించిన ఓ ఫ్రెంచ్ ఉపాధ్యాయుడి హత్య తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చేసిన కామెంట్లు ఇస్లామిక్ దేశాలకు ఆగ్రహం తెప్పించాయి
Cartoon PunchOct 19, 2020, 3:12 PM IST
కార్టూన్ పంచ్: వర్షాలు, ఎన్నికలకు మధ్య పోటాపోటీ
హైదరాబాద్: దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. వీటితో పాటే తెలంగాణలో కూడా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ శ్రేణులు ఓవైపు ముమ్మర ప్రచారానికి సిద్దం కాగా మరోవైపు వర్షాలు దంచికొడుతూ ఆ ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రత్యర్ధుల మధ్య పోటీ అటుంచితే వర్షాలకు, పార్టీలకు మధ్య ప్రస్తుతం పోటీ సాగుతోంది.
Cartoon PunchOct 12, 2020, 3:05 PM IST
కార్టూన్ పంచ్: జంతువులనూ వదలని కరోనా
కరోనా మహమ్మారి మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతోందట. ప్రస్తుతం మనుషుల్లో ఎలాగయితే ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందో అలాగే మనుషుల ద్వారా జంతువులకు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు కొందరు పరిశోదకులు నిర్దారించారు.
Cartoon PunchSep 9, 2020, 8:41 PM IST
కరోనాతో ముగియలేదు... భవిష్యత్ లో మరిన్ని మహమ్మారులు: డబ్యుహెచ్‌వో
కరోనా మహమ్మారి మాత్రమే కాకుండా ఇలాంటి అనేేక కొత్త రోగాలు సమీప భవిష్యత్ లో మానవాళిని ఇబ్బంది పెట్టనున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్ధ వెల్లడించింది.
Andhra PradeshAug 31, 2020, 8:43 PM IST
ఓవైపు కరోనా మరోవైపు అప్పులు... దారుణంగా ఏపీ పరిస్థితి
అమరావతి: అమరావతిలో కరోనా మహమ్మారి అంతకంతకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్లు రాష్ట్ర అప్పులు కూడా భారీగా పెరుగుతూ ఏపి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
Cartoon PunchAug 10, 2020, 6:33 PM IST
ప్రాణాయామంతో కరోనాకు చెక్... సరదా కార్టూన్ పంచ్
హైదరాబాద్: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారిని ప్రాణాయామం చేయడం ద్వారా తగ్గించుకునే అవకాశాలున్నట్లు ఆయుష్ మంత్రిత్వశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. రోజూ 30 నిమిషాలపాటు ప్రాణాయామం చేయడం ద్వారా రోగనిరోదక శక్తి పెరిగి కరోనా ప్రభావం తగ్గుతుందని...అందువల్ల రోజూ ప్రాణాయామం చేయాలని ఆయుష్ ప్రొటోకాల్ చెబుతోంది.
Cartoon PunchAug 3, 2020, 8:01 PM IST
రాఖీపండగ స్పెషల్ కార్టూన్
రాఖీపండగ సందర్భంగా ఏషియా నెట్ ప్రేక్షకుల కోసం సరదా కార్టూన్
businessJun 7, 2020, 1:41 PM IST
కార్టూన్ సాకుగా ‘భారత్’పై ట్విట్టర్ వివక్ష.. అమూల్ రిక్వెస్ట్ తర్వాత రీస్టోర్
‘చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి’ అనే అర్థంతో ఒక కార్టూన్‌ను అమూల్ ట్వీట్ చేసింది. ఆ వెంటనే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అమూల్ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేయడం విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.