ఎమ్మెల్యే శ్రీదేవి  

(Search results - 16)
 • undavalli
  Video Icon

  Guntur19, Jan 2020, 12:06 PM

  Video:అమరావతి నిరసన సెగ... ఎమ్మెల్యే శ్రీదేవి పర్యటన రద్దు

  అమరావతి: రాజధానిని అమరావతి నుండి తరలించకూడదంటూ అక్కడి  ప్రజలు నెలరోజులుగా చేస్తున్న నిరసనలు చేపట్టారు. అయితే ఈ నిరసన సెగ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని తాకింది. ఆదివారం తాడికొండ మండలం పొన్నెకల్లులో పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొనాల్సిన  ఆమె అమరావతి జెఏసి నాయకులు, గ్రామస్తులు అడ్డగిస్తారన్న ముందస్తు సమాచారంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. 
   

 • Sridevi

  Andhra Pradesh3, Jan 2020, 12:07 PM

  మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

  అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేస్తూ.. ఈ విగ్రహం అంబేద్కర్‌దే కదా? అని అక్కడున్న వారిని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అంబేద్కర్ అభిమానులు ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి అంబేద్కర్‌ కూడా తెలియరా? అంటూ విమర్శలు గుప్పించారు.
   

 • Sridevi

  Andhra Pradesh24, Dec 2019, 12:25 PM

  'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'..  వెతికిపెట్టమంటున్న మహిళలు!

  నిన్న...ఆర్కే..ఈ రోజు ఉండవల్లి శ్రీదేవి...వైసీపీ ఎమ్యెల్యేలు కనపడటం లేదని రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తమ ఎమ్మెల్యే శ్రీదేవి కనిపించడం లేదని మహిళలు నేడు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 • Vundavalli Sridevi

  Andhra Pradesh26, Nov 2019, 12:10 PM

  కష్టాల్లో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి: విచారణపై సర్వత్రా ఉత్కంఠ

  ఈ ఏడాది తాడికొండ నియోజకవర్గంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొనాలంటూ స్థానిక నేతలు కోరడంతో ఆమె విగ్రహ ప్రతిష్టకు వెళ్లారు. అయితే ఉండవల్లి శ్రీదేవి అన్యమతస్థురాలంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.  

   

 • YCP MLA Undavalli Sridevi with YS Jagan

  Andhra Pradesh19, Nov 2019, 11:40 AM

  శ్రీదేవి కులంపై ఫిర్యాదు: విచారణకు హాజరు కావాలని జేసీ ఆదేశాలు

  గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎస్‌‌సీ సామాజిక వర్గానికి చెందింది 

 • ysrcp mla sridevi

  Andhra Pradesh13, Nov 2019, 11:07 AM

  వనజాక్షి పై దాడి మర్చిపోయారా..? వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను

 • undefined
  Video Icon

  Districts30, Oct 2019, 8:00 PM

  video:పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మిక తనిఖీ

  పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరుగాలాల పాటు కష్టపడి పంట పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు సూచించారు.  

 • ysrcp mla sridevi met cm jagan

  Guntur6, Sep 2019, 7:54 PM

  దమ్ము, ధైర్యం ఉంటే మాట మీద నిలబడండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్

  చంద్రబాబు 40ఏళ్ల రాజకీయం మెుత్తం వెన్నుపోటు, దిగజారడు, చిల్లర రాజకీయాలేనని విమర్శించారు. తాను హిందూ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళనని తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కులధృవీకరణ పత్రం కూడా ఉందని తెలిపారు. 

 • దానికితోడు అమరావతి భూసేకరణలో అవినీతి చోటు చేసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. రాజధాని ఒక్క సామాజికవర్గానికి చెందింది కాదని అంటూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. అమరావతి పేరుతో పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొనుగోలు చేసినట్లు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు ఆయన చెబుతున్నారు. తద్వారా ఇతర సామాజిక వర్గాలను జగన్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి చెల్లు చీటి పలికితే చంద్రబాబు పాదముద్రలు గానీ ఆయన ప్రతిష్ట గానీ లేకుండా పోతుంది. క్రమంగా ప్రజలు చంద్రబాబు పేరును మరిచిపోయే అవకాశం ఉంటుంది.

  Andhra Pradesh5, Sep 2019, 9:15 PM

  ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

  వైసీపీలా కుల రాజకీయాలు చేయడం తమ సంస్కృతి కాదని స్పష్టం చేశారు. ఇకపోతే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో వైసీపీ కావాలనే కుల చిచ్చు రాజేస్తోందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 
   

 • ysrcp mla sridevi

  Andhra Pradesh5, Sep 2019, 2:52 PM

  సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి: టీడీపీ నేతలపై ఫిర్యాదు

  దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

  అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఈనెల 2న వినాయకచవితి సందర్భంగా అనంతవరంలోని వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవిని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కులం పేరుతో దూషించినట్లు ఆమె ఆరోపించారు. 

  ఈ ఘటనపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే శ్రీదేవి. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి తనకు జరిగిన అవమానంపై జగన్ కు తెలియజేశారు. తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 

  ఈ సందర్భంగా అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాను అండగా ఉంటానని వాస్తవ ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

  దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

  రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషించడాన్ని వారు తప్పుబట్టారు. వైసీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే పూజలు చేస్తున్నారని తెలిపారు. 

  ఆ సమయంలో టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపు దూసుకెళ్లారని అంతేకాకుండా ఆమెను తీవ్ర పదజాలంతో కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు.  

  ఈ ఘటనపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తూళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.   

 • undavalli sridevi

  Andhra Pradesh5, Sep 2019, 7:13 AM

  టీడీపీ నేతల దూషణలతో ట్విస్ట్: చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

  వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనంత తానుగా చిక్కులు కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు. టీడీపి నేతల అరెస్టు తర్వాత తాను చేసిన ప్రకటన ఆమెకు కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.

 • undavalli sridevi

  Andhra Pradesh3, Sep 2019, 6:31 PM

  ఎమ్మెల్యే శ్రీదేవిపై వ్యాఖ్యలు: నలుగురి అరెస్ట్

  తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దూషించిన కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలను అరెస్ట్  చేసి.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 • undavalli sridevi

  Andhra Pradesh3, Sep 2019, 1:43 PM

  అవమానిస్తున్నారు: టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్

  దళితులను టీడీపీ చులకన చూస్తోందని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ నేతలు తనను అవమానపరుస్తున్నారని ఆమె గుర్తు చేశారు.

 • undavalli sridevi

  Andhra Pradesh3, Sep 2019, 11:31 AM

  వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి: నలుగురిపై కేసు

  తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక మండపం వద్ద  పూజ చేసే సమయంలో  టీడీపీ నేతలు దూషించారని  వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
   

 • undavalli sridevi

  Andhra Pradesh2, Sep 2019, 5:57 PM

  టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

  గుంటూరు జిల్లాలోని అనంతవరంలో టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దూషించారు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు. గణేష్ చవితిని పురస్కరించుకొని పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీదేవిపై టీడీపీ నేతలు అభ్యంతకరంగా మాట్లాడారు.