ఆర్థిక మంత్రి  

(Search results - 31)
 • NATIONAL18, Oct 2019, 3:13 PM IST

  ఐదున్నరేళ్లకూ మాపై నిందలా.. నిర్మల’మ్మపై మన్మోహన్ ఫైర్

  హుందాగా, విమర్శలకు అతీతంగా వ్యవహరించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా కోపమొచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వల్లే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదన్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డారు. ఐదున్నరేళ్ల తర్వాత వైఫల్యాలకు యూపీఏదెలా బాధ్యత అవుతుందని నిలదీశారు. నిందలేయడం మాని.. సమస్యకు మూలాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలతో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
 • YSR navodayam scheme eradicate unemployment
  Video Icon

  Andhra Pradesh17, Oct 2019, 7:30 PM IST

  video: వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా నిరుద్యోగితను తగ్గించే ప్రయత్నం

  వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగితను మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. అందుకోసమే సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసమే ఈ  వైఎస్సార్ నవోదయ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిడిపిలో వాటా కలిగిన 8 శాతం ఎగుమతుల్లో దాదాపు  40శాతం ఎంఎస్ఎంఈ ద్వారానే  జరుగుతోందన్నారు.

 • buggana

  Districts15, Oct 2019, 9:15 PM IST

  ప్రతి రైతుకు రూ.67,500 పెట్టుబడి సాయం...: ఆర్థిక మంత్రి కొత్తలెక్కలు

  కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులకు ఈ  పథకం ద్వారా కలిగే లాభాలను వివరించారు.  

 • Nirmala seetharaman cancelled press meet

  NATIONAL15, Oct 2019, 9:57 AM IST

  ఆర్థిక సంక్షోభం: భర్త విమర్శలకు నిర్మలా సీతారామన్ రిప్లై

  మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, సూటిగా ఆమె జవాబివ్వలేదు.

 • parakala prabhakar

  Andhra Pradesh14, Oct 2019, 2:58 PM IST

  పీవీ, మన్మోహన్ విధానాలే బెటర్: నిర్మలా సీతారామన్ పై భర్త పరకాల తిరుగుబాటు

  ఆర్థిక సంస్కరణల్లో దివంగత ప్రధానులు పీవీ నర్సింహరావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని కొనియాడారు. పరోక్షంగా భార్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు.  
   

 • business14, Oct 2019, 12:40 PM IST

  బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా?

  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కన్నా మూసివేతకే కేంద్ర ఆర్థిక శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆ రెండు సంస్థల ఉద్యోగులు ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు. 
 • nirmala

  Automobile11, Sep 2019, 11:04 AM IST

  ‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

  ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు. 

 • business9, Sep 2019, 9:22 AM IST

  ఈ-రిటైలర్ల పండుగ ఆఫర్లపై భగ్గు: నిర్మలకు సీఏఐటీ కంప్లయింట్

  ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజ సంస్థలు పోటీపడి పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్న తీరుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల తీరు 2016 ఎఫ్‌డీఐ నిబంధనలకు వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

 • nirmala sitaraman

  business8, Sep 2019, 2:05 PM IST

  ఇన్‌ఫ్రా ప్రాజెక్టులే టార్గెట్.. రూ.100 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫోకస్

  దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంపై ద్రుష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 2024-25 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

 • subrahmanian swamy

  NATIONAL4, Sep 2019, 8:19 AM IST

  ఆ ఇద్దరూ జైలుకే... బీజేపీ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

  తిరునల్వేలి శంకర్‌నగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సుబ్రమణ్యస్వామి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదని, గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఇది జరిగిందన్నారు. ఆర్థికవేత్తగా వుంటూ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ చేపట్టిన తప్పుడు విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయన్నారు. 

 • NATIONAL30, Aug 2019, 4:54 PM IST

  బ్యాంకుల విలీనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

  బ్యాంకుల నిరర్ధక ఆస్తులను గణనీయంగా తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. 8.65లక్షల కోట్ల నుంచి రూ.7.9లక్షల కోట్లకు ఎన్ పీఏలు తగ్గించినట్లు చెప్పుకొచ్చారు. బ్యాంకుల సంస్కరణలో భాగంగా ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కానున్నట్లు స్పష్టం చేశారు. 

 • NATIONAL24, Aug 2019, 4:45 PM IST

  జైట్లీ మృతిపై కపిల్ సిబల్ దిగ్భ్రాంతి : క్రికెట్ లో మేమిద్దరం అంటూ ఫోటోలు విడుదల

  అరుణ్‌ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా కూడా ఎంతో హుందాగా వ్యవహరించారని గుర్తు చేశారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అంటూ కొనియాడారు.  
   

 • Arun Jaitley death

  ENTERTAINMENT24, Aug 2019, 3:35 PM IST

  20 ఏళ్ల క్రితమే ఆయన్ని కలిశా.. అరుణ్ జైట్లీ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు!

  మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అర్జున్ జైట్లీ ఢిల్లీలో శనివారం రోజు మృతి చెందారు. అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అర్జున్ జైట్లీ మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులంతా అరుణ్ జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

 • nirmala sitaraman

  business12, Aug 2019, 11:13 AM IST

  ప్రత్యేక నిధితో రియాల్టీకి ‘బూస్ట్’.. గృహ నిర్మాణానికి పూర్వవైభవం

  రియల్టీలో స్తంభించిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలకెక్కించి లక్షలాది మంది ఇంటి కొనుగోలుదారులకు ఊరట కల్పించేందుకు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రతినిధులతో నిర్వహించిన రెండు ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం పరిశీలనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 • nirmala sitaraman

  business6, Aug 2019, 12:01 PM IST

  వడ్డీరేట్లు తగ్గిస్తాం.. విత్తమంత్రికి బ్యాంకర్ల హామీ

  ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐఎంఎఫ్, ఏడీబీలు భారత్ జీడీపీ అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా సానుకూలంగా స్పందించారు.