Search results - 280 Results
 • indians

  NRI23, Feb 2019, 4:27 PM IST

  అమెరికాలో చైనా, పాక్ ఎంబసీల ముందు భారతీయుల ధర్నా

  పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు...పాకిస్తాన్‌పై మండిపడుతున్నారు. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలు కట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

 • Kotha Govardhan Reddy family

  NRI21, Feb 2019, 7:51 AM IST

  అమెరికాలో కాల్పులు: తెలంగాణవాసి మృతి, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు

  మాస్క్ ధరించిన యువకుడు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ కమ్ డిపార్టుమెంటల్ స్టోరులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గోవర్ధన్ రెడ్డి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. మరో గంటలో స్టోర్ మూసేసి ఇంటికి వెళ్లే సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 

 • america

  business20, Feb 2019, 10:34 AM IST

  ట్రేడ్‌వార్‌పై అమెరికా-చైనా మధ్య సయోధ్య కుదిరేనా..?

  అమెరికా, చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ప్రభావం వర్ధమాన దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి వాషింగ్టన్ లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లోనైనా ఏకాభిప్రాయం లభించేనా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 • gun fire

  NRI19, Feb 2019, 8:26 AM IST

  అమెరికాలో దారుణం: భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న తెలుగు ఎన్ఆర్ఐ

  అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు. 

 • oil

  business17, Feb 2019, 1:25 PM IST

  ఇరాన్‌పై ఆంక్షల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన భారత్ క్రూడ్ ఇంపోర్ట్స్

  ఇరాన్‌కు ఆంక్షల సెగ బాగానే తగులుతోంది. ఆరు నెలల పాటు మినహాయింపునిచ్చినా.. వచ్చే నాలుగు నెలల్లో భారత్ పూర్తిగా ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి నిలిపేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిలో డిసెంబర్ నెల నాటికి ఆరో స్థానంలో ఉన్న భారత్.. జనవరి కల్లా ఏడు స్థానానికి పతనమైంది.

 • INTERNATIONAL16, Feb 2019, 6:56 AM IST

  అమెరికాలో రెచ్చిపోయిన సాయుధుడు: కాల్పుల్లో ఐదుగురు మృతి

  అమెరికా మరోసారి కాల్పులతో దద్ధరిల్లింది. అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రియల్‌ వేర్ హౌస్ లో సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. 

 • terror

  INTERNATIONAL15, Feb 2019, 11:34 AM IST

  పుల్వామా ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు అమెరికా గట్టి వార్నింగ్

  పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్‌ జవానులు అమరులైన ఘటనపై ప్రపంచదేశాలు భారత్‌కు మద్ధతుగా నిలుస్తున్నాయి. ఇంతటి మారణహోమానికి తామే కారణమంటూ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. 

 • jail

  NRI14, Feb 2019, 7:37 AM IST

  అమెరికాలో కరీంనగర్ వాసికి జైలు: టీఆర్ఎస్ మాజీ మంత్రితో దందాలు

  రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ రెడ్డి, అతని భార్య అరుణ గుడిపాటి పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

 • modi

  business11, Feb 2019, 11:37 AM IST

  భారత్ ఎగుమతులపై జీరో టారిఫ్‌కు చెల్లు: రూ.40 వేల కోట్ల లాస్?

  ఇప్పటివరకు చైనా ఎగుమతులపై కొరడా ఝుళిపించి వాణిజ్య యుద్ధానికి తెర తీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా భారత్ ఎగుమతులపై కేంద్రీకరించారు. జీఎస్పీ కింద భారతదేశానికి 48 ఏళ్లుగా అమలవుతున్న జీరో టారిఫ్ రాయితీలను ఎత్తివేసే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అనధికారిక సమాచారం ప్రకారం తెలుస్తోంది.

 • green card

  NRI9, Feb 2019, 10:00 AM IST

  ఎన్నారైలకు శుభవార్త...గ్రీన్ కార్డ్ నిబంధనల మార్పుపై ముందడుగు

  అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూసే పరిస్థితి ఇకనుంచి తప్పిపోనున్నది. ఇప్పటివరకు దేశాల వారీగా అమలు చేసిన కోటాను ఎత్తివేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్, సెనెట్‌లలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే చట్టం అవుతుంది. దీనివల్ల భారతీయ నిపుణులకు ప్రతిభ ఆధారంగా గ్రీన్ కార్డు పొందే వెసులుబాటు లభిస్తుంది. 
   

 • america

  NRI6, Feb 2019, 11:45 AM IST

  వాళ్ల దొంగ ఓట్లతోనే ఓడిపోయా: అమెరికా నాయకుడి పోస్ట్, భారతీయుల ఫైర్

  భారతీయులు వేసిన దొంగ ఓట్ల వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానంటూ అమెరికాకు చెందిన అభ్యర్ధి ఒకరు చేసిన పోస్ట్‌పై దుమారం రేగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లోని పలు టౌన్‌షిప్పులకు ఎన్నికలు జరిగాయి

 • India-US

  NRI5, Feb 2019, 3:12 PM IST

  అమెరికాలో తెలుగు విద్యార్థులు..కోర్టులో విచారణ (వీడియో)

  ఫర్మింగ్టన్ ఫేక్ యూనిర్శిటీ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

 • India-US

  NRI2, Feb 2019, 12:41 PM IST

  అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్.. హాట్ లైన్ తెరచిన ఎంబసీ

  విద్యార్థి వీసా ముసుగులో వందల మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా నివసించేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించిన 8మంది దళారులను ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. 

 • farmington

  NRI1, Feb 2019, 5:45 PM IST

  యుఎస్ ఫేక్ వర్సిటీ: అమెరికాలో తెలంగాణ గర్భిణి అరెస్ట్

  ఫార్మింగ్ టన్ యూనివర్సిటీ కేసులో మరికొంత మంది తెలుగువారికి అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. టెక్సాస్ స్టేట్ లోని సెయింట్ ఆస్టిన్ ప్రాంతంలో పోలీసులు తనిఖీ నిర్వహించి అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించిన 10మంది తెలుగువాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన  ఓ గర్భిణి మహిళతో పాటు ఆమె భర్త కూడా వున్నారు. 

 • snow

  INTERNATIONAL1, Feb 2019, 10:27 AM IST

  ఎముకలు కొరికే చలి: ప్రమాదంలో అమెరికా ప్రజలు, మతి తప్పే అవకాశాలు

  ఎముకలు కొరికే చలితో అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. తీవ్ర హిమపాతంతో మధ్య పశ్చిమ ప్రాంతంలో చలి ప్రమాదకరస్థాయికి చేరింది. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తోన్న చలి కారణంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే కిందకు పరడిపోయాయి