తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది పబ్జీ గేమ్ ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రాణాలను బలి తీసుకుంది. పబ్జీ గేమ్ కు అలవాటు పడిన తేజేష్ అనే విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. తలుపులు వేసుకుని ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. 

తేజేష్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దేశంలో పబ్జీని నిషేధించినప్పటికి అందుబాటులో ఉండడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్జీ గేమ్ లో గన్ కొనడానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని తేజేష్ రెండు రోజుల క్రితం తండ్రిని అడిగాడు.

అయితే, తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తేజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ఎవరూ కారణం కాదని సూసైడ్ నోటు రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరుపతిలోని పీటీఆర్ కాలనీలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.

పబ్జీ అంటే ఇష్టమని తెలుసు గానీ ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని తేజేష్ కుటుంబ సభ్యులు అంటున్నారు తేజేష్ సోదరి మింటికి మంటికి ఏకధారగా ఏడుస్తోంది.