నేటి సమాజంలో బిజీ బిజీ షెడ్యూల్ గడుపుతున్న అధికారులకు ఆయన ఆదర్సదంగా నిలచాడు.  వృత్తిపరంగా అతను ఓ పోలీస్ కానిస్టేబుల్.  కానీ ఉద్యోగం వచ్చింది కదా అంటూ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతృప్తి పడలేదు.

ఎక్కడెక్కడో తిరిగి పురాతన నాణ్యాలు, పురాతన పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు  సేకరించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం అతని  ఇంటి గోడలకు  అతను సేకరించిన నాణ్యాలు, స్టాంపులు కనపడుతున్నాయి. వీటిని సైన్స్ ఎగ్జిబిషన్ లలో, బ్రహ్మోత్సవాలలో,  విద్యాలయాలలో  ప్రదర్శించడం,  విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

            
చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సురేష్ రెడ్డి అనే కానిస్టేబుల్ గత కొంత కాలంగా పని చేస్తున్నాడు.  1998 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తిరుపతి పోలీస్ కోటర్స్ లో కాపురం ఉంటున్నాడు. ఉద్యోగం సంపాదించిన  పదేళ్ల తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మరేదైనా విద్యార్థులకు, సమాజానకి  మేలు చేయాలనే తపన ఉండేది.

ఆ తపనతోనే అక్కడక్కడా తిరుగుతూ పురాతన నాణ్యాలు, పురాతన పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు  సేకరించే పనిలో పడ్డారు. 2000 రకాలకు పైగా వివిధ దేశాల నాణ్యాలు, రాజుల కాలంలో నాణ్యాలు, పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు  సేకరించారు.

వీటిని తాను నివాసం ఉంటున్న ఇంటిలో గోడలకు ప్రదర్శనగా ఉంచి పలువురికి  ఆదర్శంగా నిలిచాడు. ఇంటిలో ఏ గోడను చూసిన దేవుడి పటాలు కు బదులు నాణేల అతికించిన పటాలు ఉండడం ప్రత్యేకంగా ఉంది. ఇతని నాణ్యల ప్రదర్శన పలువురుని ఆకట్టు కుంటుంది. 

సేకరించిన నాణ్యాలు,  స్టాంపులు
కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సురేష్ రెడ్డి  పలు రాష్ట్రాలు,  దేశాలు, పలు ప్రాంతాలు తిరిగి నాణ్యాలు సేకరించారు.  చోళులు పరిపాలించిన కాలంనాటి నాణేలు స్టాంపులు, పుదుక్కొట్టై, విష్ణు కుండలీలు, విజయనగర సామ్రాజ్యం, మైసూరు రాజులు, బ్రిటిష్, ప్రెంచ్, పోర్స్ గ్రీకు, డచ్, వెలయిల్ సామాజ్రం, సుల్తాన్, మరాఠీల,  కాలాల నాటి నాణ్యాలు, స్టాంపులు, బాండ్ పేపర్ లు, శ్రీవారి ముద్రతో వేసిన నాణ్యాలు, శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు, మహాత్మా గాంధీ బొమ్మ నాణ్యాలు ఉన్నాయి. దాదాపు మూడు వేల సంవత్సరాల నాటి నాణ్యాలు సైతం సేకరించి ఇతను అబ్బురపరిచారు. తను కానిస్టేబుల్ గా ఉద్యోగం చేసుకుంటూనే రెండు వేల రకాలకు పైగా నాణ్యాలు సేకరించి పలువురిని అబ్బుర పరిచి, పలువురికి ఆదర్శంగా నిలిచారు. 

ప్రదర్శనలు
తాను సేకరించిన నాణ్యలు కేవలం ఇంటిలోనే ఉండకుండా పలు చోట్ల ఇతను ప్రదర్శనగా ఉంచుతాడు. సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా అక్కడికి ఈ నాణేలను తీసుకెళ్లి ప్రదర్శస్తాడు.

టిటిడి బ్రహ్మోత్సవాల సమయంలో, శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల సమయంలో, తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతి ఏటా ఈ నాణేలను ప్రదర్శిస్తాడు.

అలాగే ఎస్వీ యూనివర్సిటీలో, ఎక్కడైనా నాణ్యల పోటీలు జరిగినప్పుడు వీటిని  ప్రదర్శించి ఉత్తమ బహుమతులను పొందుతాడు. గత సంవత్సరం పోస్టల్ డిపార్ట్ మెంటు నిర్వహించిన పోటీలలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించారు.

అలాగే ఈ నాణ్యాలు ఎక్కడ ప్రదర్శించిన అక్కడ బహుమతులు సాధించి పలువురికి ఆదర్శంగా నిలవడం ఆయనకు సరిసాటి గా మారింది. పోలీస్ ఉన్నత శాఖ అధికారులు సైతం ఈ నాణేలను సేకరించిన సురేష్ రెడ్డి ని పలు సమయాల్లో అభినందించారు.

ఉద్యోగం చేసుకుంటూ బిజీ బిజీగా గడుపుతున్న నేటి సమాజంలో పలువురికి ఆదర్శంగా ఉంటూ వీటిని  సేకరిస్తూ, తన ఉద్యోగం తాను చేసుకుంటూ ఆదర్శంగా నిలిచాడు. 

 మ్యూజియంతో  అవగాహన 
దాదాపు రెండువేల రకాలకు పైగా నాణ్యాలు, స్టాంపులు, బాండ్ పేపర్లు సేకరించాను. తనకు వస్తున్న జీవితంలో సగం ఖర్చు పెట్టి ఈ నాణ్యాలు సేకరణకు వివిధ రాష్ట్రాలు దేశాలు ప్రాంతాలు తిరిగాను.

తిరుపతిలో మ్యూజియం ఏర్పాటు చేసి వీటిపై దేశ విదేశీ యులకు నేటి తరం విద్యార్థులకు, భావి భారత పౌరులకు నాణ్యాలు స్టాంపులు బాండ్ పేపర్ లపై అవగాహన కల్పించాలి. ప్రస్తుత చదువుల్లో ప్రపంచానికి సంబంధించిన చరిత్ర అనేది లేకుండా పోయింది.

వీటిని భావితరాలకు తెలిపితేనే పూర్వకాలంలో ప్రజలు ఇలా ఉండేవారని ఇలాంటి వస్తువులు వాడే వారిని అవగాహన ఉంటుంది. వీలైనన్ని మరిన్ని నాణ్యాలు సేకరిస్తా. ప్రభుత్వం సహకరిస్తే మ్యూజియం ఏర్పాటు చేసి వీటిని ప్రదర్శనగా ఉంచుతాను అంటారాయన