Asianet News TeluguAsianet News Telugu

హోబర్ట్ ఇంటర్నేనల్ టోర్నమెంట్ ను గెలిచిన సానియా జోడీ

హోబర్ట్ అంతర్జాతీయ టోర్నమెంటును సానియా మీర్జా, నదియా జోడీ గెలుచుకుంది. రీఎంట్రీలో తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చాటి చెప్పింది.

Sania Mirza wins Hobart International tournament
Author
Hobart TAS, First Published Jan 18, 2020, 12:40 PM IST

హోబర్ట్: హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రీఎంట్రీలో ఘన విజయాన్ని అందుకుంది. సానియా మీర్జా జోడీ హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ను గెలుచుకుంది. ఉక్రేయిన్ కు చెందిన నదియా కిచెనోక్ తో కలిసి ఆమె ఈ విజయాన్ని సాధించింది. 

సానియా జోడీ శనివారం జరిగిన పైనల్ మ్యాచులో చైనాకు చెందిన ఝాంగ్ షుయీ, పెంగ్ షుయీ జోడీని ఓడించి టోర్నమెంటును గెలుచుకుంది. చైనా జోడీని సానియా జోడీ 6-4, 6-4 స్కోరుతో ఓడించింది. 

also Read: రీఎంట్రీ అదుర్స్: ఫైనల్ కు దూసుకెళ్లిన సానియా మీర్జా జోడి

సానియా, నదియా జోడీ ప్రత్యర్థులకు ఏ మాత్రం తిప్పికొట్టే అవకాశాన్ని ఇవ్వలేదు. మ్యాచును ఏకపక్షం చేసింది. తద్వారా సూనాయసమైన విజయాన్ని సానియా జోడీ అందుకుంది. 

శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో సానియా, నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ 7-6 (3), 6-2 తేడాతో టమరా జిదాన్ సెక్ (స్లోవేనియా), మేరీ బౌడ్ కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది.

సెమీ ఫైనల్ లో విజయం సాధించిన సానియా జోడీ ఫైనల్ లోకి దూసుకెళ్లింది. గుంటా 24 నిమిషాల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచులో పూర్తిగా పట్టు సాధించింది. 15 బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచుపై ఆధిపత్యం సాధించి విజయాన్ని అందుకుంది. 

Also Read: గ్రాండ్ గా సానియా సెకండ్ ఇన్నింగ్స్....విజయం తరువాత కొడుకు ఫొటోతో ట్వీట్ వైరల్

2017లో చైనా ఓపెన్ లో చివరిసారి సానియా ఆడింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడలోకి అడుగు పెట్టింది. తల్లి కావడంతో ఇంతకాలం ఆమె టెన్నిస్ కోర్టుకు దూరంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios