భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఖతార్ ఓపెన్ తొలి రౌండ్ లోనే వెనుదిరిగారు. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ లో ఫ్రెండ్ క్రీడాకారణి కరోలిన్ గార్సియాతో కలిసి సానియా బరిలో దిగింది. కాగా... వారి ప్రత్యర్థులైన లారా( జర్మనీ), కాగ్లా(టర్కీ) జోడి చేతిలో సానియా జోడి ఓటమిపాలయ్యింది.

Also Read సానియా ఈజ్ బ్యాక్.. మళ్లీ నాజూకుగా మారిన టెన్నిస్ బ్యూటీ...

4-6, 5-7 తేడాతో వరస సెట్లలో పరజయాన్ని చవి చూశారు. దీంతో తొలి రౌండ్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అంతకముందు కరోలినాతో కలిసి పాల్గొన్న దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ లోనూ సానియా రెండో రౌండ్ లోనే నిష్క్రమించింది.

దాదాపు రెండేళ్ల తర్వాత రాకెట్ పట్టుకున్న ఆమె ఇటీవల హోబర్ట్ అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మహిళా డబుల్స్ లో ఉక్రెయిన్ బామ నదియాతో కలిసి టైటిల్ సాధించింది. 2017లొ మోకాలి గాయం, ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్డం కారణంగా సానియా మీర్జా దాదాపు రెండేళ్లపాటు ఆటకు దూరమైంది.