ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో ఎవరికి వారు సెల్ఫ్ క్వాంటైన్ పాటిస్తున్నారు. అయితే... కెనడాకు చెందిన ప్రముఖ టెన్నిస్ తార, 2014 వింబుల్డన్ రన్నరప్ గినీ బౌచర్డ్ కూడా స్వీయ నిర్భందంలో ఉండిపోయారు. అయితే.. ఇంట్లో ఉండి బోర్ కొట్టడంతో.. ఆమె చేసిన పని ఇప్పుడు వైరల్ అయ్యింది.

Also Read బాధ్యత అంటే ఇది : లండన్ నుంచి వచ్చి సెల్ప్ క్వారంటైన్‌లోకి.. సంగక్కర‌పై ప్రశంసలు...

ఇంతకీ మ్యాటరేంటంటే... గినీ బౌచర్డ్ ఇటీవల ట్విట్టర్ లో తన అభిమానులతో చాట్ చేశారు. ఈ క్రమంలో క్వారంటైన్ గురించి ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ‘ ఎవరినీ ఉద్దేశించి కాదు కానీ, క్వారంటైన్ లో బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మరింత బాగుంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా... ఆమె ట్వీట్ కి నెటిజన్ల స్పందన అదిరిపోయింది. ఆమె చేసిన ట్వీట్ లోని ఈమెయిల్ కి ఎక్కువ సంఖ్యలో డేటింగ్ రెజ్యూమేలు పంపించారు. ఈ విషయాన్ని తన మేనేజర్ చెప్పాడని, ఇకపై తనకు అలాంటి రెజ్యూమేలు పంపొద్దని మరో ట్వీట్ లో ఆమె పేర్కొన్నారు.

గినీ బౌచర్డ్.. తన ఆటకన్నా కూడా ఎక్కువగా హాట్ ఫోజులతో అభిమానులను సంపాదించుకుంది. అలాంటి బ్యూటీ బాయ్ ఫ్రెండ్ లేడు అని బాధపడుతుంటే.. అభిమానులు ఊరుకుంటారా..? అందుకే మెయిల్స్ తో చంపేశారు.