అశ్లీల ఫోటోలతో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తూ... హైదరాబాద్ యువకుడు అరెస్ట్

సోషల్ మీడియా నుండి యువతి ఫోటోలను సేకరించి... వాటిని మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసారు. 

youth blackmails young girl in hyderabad

హైదరాబాద్: అతడి వృత్తి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్... ప్రవృత్తి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి ఈజీగా మనీ సంపాదించడం. సోషల్ మీడియా నుండి యువతుల ఫోటోలను సేకరించి తనకున్న కంప్యూటర్ నాలెడ్జ్ తో వాటిని మార్పింగ్ చేస్తాడు. ఇలా యువతుల ఫోటోలను అసభ్యంగా తయారుచేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగుతుంటాడు. ఇలా అమ్మాయిలను వేధించడమే పనిగా పెట్టుకున్న నీచున్ని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోసారు.  

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నాచారంలో నివాసముంటున్న గోవింద్ నారాయణ ఓ సంస్థలో కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అయితే అతడు చెయిన్ స్మోకర్ కావడం, మద్యానికి బానిసవడంతో జీతం డబ్బులు సరిపోయేవి కావు. దీంతో ఈజీ మనీ కోసం అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.   

ఇలా తన బంధువుల అమ్మాయికి స్నేహితురాలైన ఓ యువతిని టార్గెట్ చేసిన గోవింద్ ఇన్స్టాగ్రామ్ నుండి ఫోటోలు సేకరించాడు. ఈ ఫోటోలను తన ఎడిటింగ్ నాలెడ్జ్ తో మార్పింగ్ చేసి అసభ్యకరంగా చేసాడు. ఓ నకలీ అకౌంట్ ను క్రియేట్ చేసుకుని దానిద్వారా బాధిత యువతికి ఈ ఫోటోలు పంపించాడు. తాను సూచించిన అకౌంట్ కు డబ్బులు పంపాలని... లేదంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.  

అయితే ఈ బ్లాక్ మెయిలింగ్ కి భయపడిపోకుండా యువతి ధైర్యంగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ సైబర్ క్రైం విభాగం యువతి నుండి సేకరించిన వివరాలు, సాంకేతికత సాయంతో నిందితుడిని గుర్తించారు. చెడు అలవాట్లకు బానిసై ఇలా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిన గోవింద్ ను అదుపులోకి తీసుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇక జూబ్లీహిల్స్ లో యువతిపై గ్యాంగ్ రేప్ తర్వాత హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అమ్మాయిలు, మహిళలపై వరుసగా అఘాయిత్యాలు వెలుగుచూస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ లోని గత ఐదారు రోజులుగా ముగ్గురు మైనర్లతో పాటు మరో ఇద్దరు యువతులు అత్యాచారానికి గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థంచేపుకోవచ్చు. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, వేధింపులు జరుగుతున్నాయి.  

హైదరాబాద్ లో నెక్లెన్ రోడ్ లో, ఓ సినిమా ధియేటర్ పరిసరాల్లో, పాతబస్తీ ప్రాంతంలో, హైదరాబాద్ శివారులో అమ్మాయిలపై అఘాయిత్యాలు వెలుగుచూసాయి. ఈ దారుణ ఘటనలతో తెలంగాణలో ఒక్కసారిగా మహిళల రక్షణపై అనుమానాలు మొదలయ్యాయి. షీ టీమ్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేసినా మహిళలకు రక్షణ కరువవడంతో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లెవెత్తుతున్నాయి. 

ఇదిలావుంటే జూబ్లీహిల్స్ లో విదేశీ బాలికపై దారుణ అత్యాచారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార టీఆర్ఎస్ ఈ దారుణానికి పాల్పడిన యువకులను కాపాడే ప్రయత్నం చేస్తోందని... ఇందుకోసం పోలీసులపై ఒత్తిడి తెస్తోందని బిజెపి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ దాని మిత్రపక్షం ఎంఐఎం పార్టీలకు చెందిన కీలక నాయకుల పిల్లలు ఆ అత్యాచార కేసులో ప్రధాన నిందితులుగా వుండటంతో వారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బిజెపి ఆరోపిస్తోంది.  పోలీసులు మాత్రం లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని చట్టప్రకారమే వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios