Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: గంజాయి మత్తులో యువతీ యువకులు... హార్స్ రైడింగ్ క్లబ్ పై పోలీసుల దాడి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గంజాయిపై ఉక్కుపాదం మోపిన పోలీసులు హైదరాబాద్ శివారులోని హార్స్ రైడింగ్ క్లబ్ లో మత్తులో తూగుతున్న యువతీ యువకులను  అదుపులోకి తీసుకున్నారు.  

Youth arrested with ganja in rangareddy district
Author
Hyderabad, First Published Oct 22, 2021, 11:45 AM IST

మొయినాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గంజాయి, డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని ఫార్మ్ హౌస్ లలో సంపన్నుల పిల్లలు  గంజాయి, డ్రగ్స్ పార్టీలతో హంగామా చేస్తుంటారు. దీంతో నగరు శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని అజీజ్‌నగర్‌లో ఉన్న హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌లో యువతీ యువకులు గంజాయి మత్తులో మునిగితేలుతున్నట్లు గుర్తించారు. దీంతో సదరు క్లబ్ లో పోలీసులు సోదాలు నిర్వహించగా భారీగా గంజాయి పట్టుబడింది. 

విశ్వసనీయ సమాచారంతో horse riding club పై పోలీసులు దాడులు చేసారు. ఈ సమయంలో అక్కడున్న యువతీ యువకులు గంజాయి సేవించి మత్తులో వున్నట్లు గుర్తించారు. ఇలా ganja మత్తులోని యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అలాగే క్లబ్ లో సోదాలు నిర్వహించగా గంజాయి లభించింది. దీంతో క్లబ్‌ నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

telangana లో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగంపై సీఎం కేసీఆర్ కన్నెర్ర చేసారు. ఇటీవలే అధికారులతో ఈ విషయంపై చర్చించిన సీఎం గంజాయిని సాగుచేస్తే రైతుబంధు, రైతు బీమా వుండదని హెచ్చరించారు. తెలంగాణలో ఒక్క గంజాయి మొక్క కూడా కనిపించకూడదని అధికారులను ఆదేశించారు cm kcr.

read more  గంజాయిపై యుద్ధం, ఎంతటివారైనా ఉపేక్షించం: కేసీఆర్ వార్నింగ్

స్కూల్ పుస్తకాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలపై సిలబస్ పెట్టి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ విద్యాశాఖ అధికారులను కూడా ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి లభ్యత పెరిగిందని... నిర్లక్ష్యం చేస్తే చేయిదాటే ప్రమాదం వుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలిసీ తెలియక యువత ఈ మాదకద్రవ్యాల బారిన పడుతున్నారని... డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని చెప్పారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. గంజాయి అక్రమాలపై ప్రత్యేక పర్యవేక్షణ కోసం డీజీ స్థాయి అధికారి నియమిస్తామని Kcrప్రకటించారు.

ఇక విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇంటలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులకు సూచించారు. గంజాయి సాగుకు పాల్పడే నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు.

read more  గంజాయి సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా కట్: కేసీఆర్ సంచలన నిర్ణయం

సీఎం ఆదేశాలతో తెలంగాణ పోలీసులు ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పెద్ద ఎత్తున  సోదాలు నిర్వహించారు. గంజాయి సాగు చేస్తున్నవారిపై కేసులు పెట్టారు. సుమారు 150 మందికిపైగా కేసులు నమోదయ్యాయి. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై 23 మందిపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ శివారులో యువతీ యువకులకు గంజాయిని విక్రయిస్తున్న హార్స్ రైడింగ్ క్లబ్ పై పోలీసులు దాడిచేసారు.  

Follow Us:
Download App:
  • android
  • ios