Asianet News TeluguAsianet News Telugu

ఇన్ స్టాగ్రామ్ లో యువతులతో పరిచయం.. న్యూడ్ ఫొటోలు పంపాలంటూ వేధింపులు....

సోషల్ మీడియా ఎన్నో నేరాలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా స్త్రీల మీద వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్చువల్ గా పరిచయం పెంచుకుని మహిళల్ని లైంగిక వేధింపులకు గురిచేసే కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

youth arrested in hyderabad for harassment women on instagram - bsb
Author
Hyderabad, First Published Feb 5, 2021, 5:00 PM IST

సోషల్ మీడియా ఎన్నో నేరాలకు అడ్డాగా మారుతోంది. ముఖ్యంగా స్త్రీల మీద వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వర్చువల్ గా పరిచయం పెంచుకుని మహిళల్ని లైంగిక వేధింపులకు గురిచేసే కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో యువతులతో పరిచయం పెంచుకుని వారిని వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిని హైదరాబాద్ లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముందు అమాయకుడిగా ఇన్ స్ట్రాగ్రాంలో అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటాడు. ఆ తరువాత వారి న్యూడ్ ఫొటోలు పంపమంటూ వేధింపులకు పాల్పడతాడు.

ఇతని వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇన్ స్ట్రాగ్రాం ఐపీ అడ్రస్ తో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని కనిపెట్టి,  అరెస్ట్ చేశారు. నిందితుడు హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ రామన్నగూడెం ప్రాంతానికి చెందిన సంతోశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. 

సంతోష్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన సరదా కోసం యువతులను ఇలా వేధిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios