Asianet News TeluguAsianet News Telugu

లేడీ టెక్కీపై రేప్: బ్లేడుతో గుండెపై తన పేరు రాసుకోవాలని ఒత్తిడి

ఓ యువకుడు ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరును శాడిస్టులా మారి వేధింపులకు గురిచేశాడు. స్నేహం పేరుతో పార్టీలకు పిలిచి,ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది.

Youth arrested for harassing a lady software engineer in Hyderabad
Author
Hyderabad, First Published Jun 11, 2020, 7:12 AM IST

హైదరాబాద్: ఓ శాడిస్టు మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరును అత్యంత అమానుషంగా వేధించాడు. స్నేహం పేరు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె పార్టీలకు పిలిచి, తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీశాడు. వాటిని తల్లిదండ్రులకు చూపిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. బ్లేడుతో గుండెల మీద తన పేరు రాసుకోవాలని, రక్తం కారుతుంటే తాను వీడియోలో చూస్తానని ఆమెపై ఒత్తిడి తెచ్చారుడు. బ్లేడు గాట్లకు రక్తం కారుతుంటే ఆమె రోదిస్తూ ఉండగా అతను వీడియోలో చూసి ఆనందించాడు. 

ఎప్పటికప్పుడు వదిలేస్తానని చెబుతూనే వీడియో కాల్ చేస్తూ తాను చెప్పినట్లు చేయాలని బెదిరిస్తూ మూడు నెలలుగా ఆమెకు నరకం చూపిస్తున్నాడు. సైబరాబాద్ పరిధిలోని కూకట్ పల్లిలో ఈ ఘటన జరిగింది. చివరకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు అతనిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయనున్నారు. 

కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన యువతి లాక్ డౌన్ కు ముందు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడే ఇంటర్వ్యూకు వచ్చన రాయలసీమకు చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. ఆమెతో మాటలు కలిపి ఫోన్ నెంబర్ తీసుకున్నడాు. 

వారం తర్వాత ఆమెకు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతడికి రాలేదు. అయితే, స్నేహం పేరుతో ఆమెకు నిత్యం ఫోన్ చేస్తూ వచ్చాడు. ఆమె ఉంటున్న హాస్టల్ వైపు వెళ్లేవాడు. కొన్నాళ్లకు తాను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. తనకు ఆ ఉద్దేశం లేదని ఆమె చెప్పింది. అయితే, మిత్రులుగా ఉందామని చెప్పి ఆమెను రెస్టారెంట్లకు, పార్టీలకు ఆహ్వానించేవాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ వచ్చాడు. 

ఓ రోజు హోటల్ కు పిలిచి తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. లేదంటే తనతో దిగిన ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. దాన్నంతా వీడియో తీశాడు. ఆ తర్వాత దాన్ని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. 

లాక్ డౌన్ కారణంగా ఇంటికి వెళ్లిపోయినా కూడా యువతికి వేధింపులు తప్పలేదు. వాట్సప్ లో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వచ్చాడు. ఆమె తీరును గమనించిన అన్నయ్య విషయాన్ని ఆరా తీశాడు. దాంతో అమె అతని వద్ద బోరుమని విషయం చెప్పింది. 

దాంతో యువతి అన్నయ్య సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళ, శిశు సంరక్షణ విభాగం డీసీపీ అనసూయ బాధిత మహిళతో మాట్లాడారు. ఆ యువతి విషయాన్ని ఆమె సజ్జనార్ దృష్టికి తీసుకుని వెళ్లింది. సజ్జనార్ ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios