Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్‌ డేటింగ్‌కు యువకుడు బలి.. నగ్న వీడియోలతో యువతి బెదిరింపులు, భయంతో ఉరి

తెలుగు రాష్ట్రాల్లో హానీ ట్రాప్ వ్యవహారాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. నిన్న విశాఖలో హానీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో ఆన్‌లైన్ డేటింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు.
 

young man commits suicide over online dating
Author
hyderabad, First Published Aug 12, 2021, 8:41 PM IST

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ డేటింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ యువతితో చాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో నగ్నంగా వీడియో కాల్స్‌లో మాట్లాడాడు బాధితుడు. చివరికి నగ్న వీడియోలను చూపించి యువకుడిని బెదిరించింది మహిళ. దీంతో భయంతో ఉరి వేసుకున్నాడు ఆ యువకుడు. 

కాగా, బుధవారం హానీ ట్రాప్ కేసును ఛేదించారు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు. కాల్ మీ ఎనీ టైం అనే అడ్వర్టైజ్‌మెంట్ చూసి మోసపోయాడు విశాఖకు చెందిన బాధితుడు ప్రణీత్. న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి బాధితుడి దగ్గర రూ. 24 లక్షలు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. హైదరాబాద్ నుండి ఈ ఘరానా మోసం జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో జ్యోతి అనే మహిళ కూడా వుంది. మొత్తం 24 లక్షల్లో మూడున్నర లక్షల సొత్తును రీకవరీ చేసినట్లు పోలీసులు వివరించారు. అలాగే నిందితుల నుంచి 5 స్మార్ట్ ఫోన్లు, 3 సాధారణ మొబైల్స్, 3 ఏటీఎం కార్డ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios