యాదాద్రి సెక్స్ రాకెట్: కొత్త కోణాన్ని బయటపెట్టిన కమిటీ

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 25, Aug 2018, 4:48 PM IST
Yadadri Sex Rocket: fact Finding committee repor
Highlights

ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ నెల 22వ తేదీన యాదగిరి గుట్ట లో పసిపిల్లల వ్యభిచారంమీద నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేసింది.

హైదారబాద్:  ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ నెల 22వ తేదీన యాదగిరి గుట్ట లో పసిపిల్లల వ్యభిచారంమీద నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేసింది.  యాదాద్రిలో సెక్స్ రాకెట్ మీద జరిగిన ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా  దొమ్మరి కులం వారిని అక్కడ్నించి తరిమేయడం వెనక కోట్ల విలువ చేసే యాదాద్రి భూమి ఉందని ఆ కమిటీ తేల్చింది. 

ఆ భూమి వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో, ప్రభుత్వ యూదాద్రి అభివృధి నమూనాలో ప్రముఖ మైందని కమిటీ అభిప్రాయపడింది. చిన్న పిల్లలతో వ్యభిచారం  చేయించడం, పిల్లల క్రయ విక్రయా లు, అపహరణలు చేయడం కచ్చితంగా చాలా అమానవీయమైన, క్రూ రమైన పని అని అభిప్రాయపడింది.

దానికి కచ్చితంగా ఆ పని చేస్తున్న వ్యభిచార గృహ నిర్వహకులను కఠినంగా శిక్షించాలని,  అదే సమయంలో వ్యభిచారం మానేసి ఉప్పరి, పొలం పనులు, పూలమ్మే పనులు, డ్రైవింగ్ పనులు చేస్తూ గౌరవ ప్రదంగా జీవిస్తున్న  స్థానిక దొమ్మరి కులం వాళ్ళ మీద దాడులు చేయడం, అక్కడ్నించి వారిని తరిమేయడం, విద్యాసంస్థలకు వెళ్తున్నవారిని కూడా వేధించడం సరైంది కాదని అభిప్రాయపడింది.

రాత్రి టీ స్టాళ్లలో పని చేస్తూ పగలు  కాలేజీలో ఇంటర్ చదువుతున్న వంశీ లాంటి యువకులను అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద  జైల్లో పెట్టడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించింది. పిల్లల అమ్మకాలు సాగించిన వారిని వదిలేసి, న్యాయంగా వృత్తి వదిలేసి బతుకుతున్నవారిని చెట్టు కొకరిని, పుట్టకొకరిని తరిమెయ్యడం, భయ భ్రాంతులకు గురి చేయడం అన్యాయమని అభిప్రాయపడింది.

నిజ నిర్దారణ కమిటీ విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి..... వారికి సరైన ప్రత్యామ్నాయ జీవన భృతి లేదు.నకాంట్రాక్ట్ హోమ్ గార్డ్ ఉద్యోగాల్లో నెలల తరబడి జీతలివ్వక పోవడం వల్ల ... తిన తిండి లేక ఉద్యోగాలు మానేశారు. పందుల పెంపకం, అమ్మకం అనే మరో జీవనాధారాన్ని దూరం చేశారు. ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళి పొమ్మని... ఎక్కడైనా చదువుకోండని నిర్దాక్షిణ్యంగా చెబుతున్నారు పోలీసులు. ఇళ్లున్నా రోడ్ల మీద పడుకోవలసిన పరిస్థితి. వీళ్ల స్వంత పిల్లల్ని కొంత మందిని కూడా ఎత్తు కొచ్చిన పిల్లలని రిస్క్ హోమ్స్ కి తరలించారని కన్న తల్లులు తల్లడిల్లుతున్నారు. డిఎన్ఎ పరీక్షలు చేసి తమ పిల్లల్ని అప్పజెప్ప మంటున్నారు.సంవత్సరాల క్రితం వ్యభిచార వృత్తికి దూరమైన వీళ్ళు... సామాజిక, ఆర్థిక భద్రతను కోరుకుంటున్నారు.
 

దొమ్మరి కులం వారిని బిసి -ఎ కేటోగిరీ లో చేర్చడం వల్ల వారు రిజర్వేషన్ ఫలాలకు దూరం అవుతున్నారు తమని గిరిజనులుగా పరిగణించి ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.  గతంలో ఉద్యమాలు కూడా చేశారు వ్యభిచారం మానేసిన దొమ్మరి కులం వాళ్ళు.  విటులు తమవద్దకు వ్యభిచిరంచడానికి  రావద్దని. తాము వ్యభిచారం మానేశామని, వస్తే పోలీసులకు పట్టిస్తామని ముద్రించిన ఫ్లెక్సీలు వీధి వీధిలో పెట్టారు. పిల్లలని ఎత్తుకొచ్చి పిల్లలని అత్యంత హేయమైన వ్యభిచార కూపంలోకి ,లాగడం అమానవీయమైంది.

దీన్ని ఖండిస్తూ, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ... పొస్కో లాంటి  చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ సక్రమంగా అమలు చేయాలని, దొమ్మరి కులం వారికి ఆర్థిక, సామాజిక భద్రత నిచ్చే ఉద్యోగాలు ఇవ్వాలని, వారిని వారి భూమి నించి ఇళ్లనించి బేదఖల్ చేయధ్దని, నిర్వాసితులను చేయద్దని ,విద్యార్థి అయిన వంశీ లాంటి వాళ్ళను వదిలేయాలని. రిస్క్ హోమ్స్ లో ఉన్న కన్నపిల్లలను తల్లిదండ్రులకి అప్ప చెప్పడానికి ఒక ఉన్నత స్థాయి లో కమిటీని వేయాలని కోరుతున్నాం.

దొమ్మరి కులంలో  వారికి ఆరే భాష  మౌఖికంగా ఉంది కానీ లిపి లేదు. వారి భా షా సంస్కృతులను కాపాడాలని, వారిని ప్రత్యేక జాతిగా గుర్తించాలని, వారి సమస్యను సంస్కరణల కే పరిమితం చేసి పరిష్కారాలు వెతక్కుండా, ఈ బోగం వృత్తి  వేళ్లూనుకున్న ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థలో దీని మూలాలు వెతకాలని చెబుతూ యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం 100 కోట్లను కేటాయించింది.దుర్భరమైన బతుకు ఈడుస్తున్న యాదగిరి గుట్టలో  దొమ్మరి కులం వారి అభివృద్ధికి  కూడా ఈ డబ్బును కేటాయించాలని కోరుతున్నాం. 

యాదాద్రి చైల్డ్ ట్రాఫికింగ్ నిజ నిర్ధారణ కమిటీలో పివోడబ్ల్యు, విరసం, ప్రరవే, ఇఫ్టు ప్రతినిధులు ఉన్నారు. 

ఈ కథనాలు కూడా చదవండి

యాదాద్రి సెక్స్ రాకెట్: మరో ఏడుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచారం మానేశాం, విటులు రావద్దంటూ పోస్టర్లు

యాదాద్రి సెక్స్ రాకెట్... వ్యభిచారుణులనే తల్లులుగా భావిస్తూ రోదిస్తున్న చిన్నారులు

యాదాద్రి సెక్స్ రాకెట్: తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు

ఎవరీ కల్యాణి: యాదాద్రి సెక్స్ రాకెట్ ఎలా వెలుగు చూసింది?

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

యాదగిరి గుట్ట సెక్స్ రాకెట్: మహానది సినిమా చూశారా?

 

loader