Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి సెక్స్ రాకెట్: తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు

యాదాద్రి సెక్స్ రాకెట్ పై దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు 110 కుటుంబాలు బాలికలతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

Yadadri sex rocket: 110 families ran away with girls

యాదాద్రి: యాదాద్రి సెక్స్ రాకెట్ పై దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాదాపు 110 కుటుంబాలు బాలికలతో పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 15 మందిపై పీడి యాక్ట్ పెట్టారు. యాదగిరి గుట్ట పోలీసులు ఆపరేషన్ ముష్కాన్ ను కొనసాగిస్తున్నారు.

యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాలపై పోలీసులు గత నెల 30వ తేదీన దాడులు చేశారు. అయితే, వాటిని సాధారణమైన విషయంగానే భావించారు. అయితే, ఆ తర్వాత పోలీసులు బాలికల వివరాలపై ఆరా తీస్తుండడంతో వ్యభిచార గృహాల నిర్వాహకులు అప్రమత్తయ్యారు. దాదాపు 110 మంది బాలికలను తీసుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తమ కూతుళ్లను కోల్పోయిన తల్లిదండ్రులు యాదగిరి గుట్ట పిఎస్ కు క్యూ కడుతున్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో వ్యభిచారం జరుగుతోంది.. జాతీయ రహదారుల వెంట ఉండే దాబాలు, మద్యం దుకాణాల పరిసరాలూ అందుకు స్థావరాలుగా మారాయి. సంతలో పశువుల మాదిరిగా యువతుల క్రయవిక్రయాలు కూడా జరుగుతాయి. ఇందులో భాగంగానే యాదాద్రిలోని బాలికలు, యువతులను నిర్వాహకులు ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తోంది.
 
యాదాద్రిలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో చాలా కాలంగా వ్యభిచారం సాగుతోంది. కొండ కింది ప్రాంతంలో గదులు అద్దెకు తీసుకుని కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి ఫోన్‌ ద్వారా విటులకు సమాచారం అందిస్తున్నారు.  

గతంలో రెండు సార్లు పోలీసులు దాడి చేసి ఐదుగురు యువతులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 8 మంది యువకులపైనా కేసులు పెట్టారు. ధర్మపురి లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం పరిసరాల్లో కూడా చాలా కాలంగా వ్యభిచారం సాగుతోంది. మంచిర్యాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఇరువైపులా 20 మందికిపైగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారంటూ గతంలో గుంటూరుకు చెందిన బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. కొన్నేళ్లుగా సిద్దిపేటలోని ఎన్సాన్‌పల్లికి వెళ్లే దారిలో వ్యభిచార గృహాలు కొనసాగుతున్నాయి.
 
కొందరు మహిళలు స్వచ్ఛంద సంస్థలు, సేవాశ్రమాల ముసుగులో కూడా వ్యభిచార కేంద్రాలను నడుపుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios