Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి సెక్స్ రాకెట్: మరో ఏడుగురు చిన్నారులను కాపాడిన పోలీసులు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో మరోసారి అలజడి రేగింది.  పోలీసుల వరుస దాడులతో ఇక్కడ వ్యభిచార వృత్తి అంతం అయిందని అందరు భావిస్తున్న సమయంలో మరోసారి వ్యభిచార ముఠాలు పట్టుబడ్డాయి. అంతే కాదు వారి వద్దనుండి ఏడుగురు చిన్నారులను  పోలీసులు కాపాడారు. ముఖ్యంగా పోలీసులు యాదగిరి గుట్టలోని సుభాష్ నగర్, అంగడి బజార్, గణేష్ నగర్లలో చేపట్టిన తనిఖీల్లో ఈ ముఠాలు పట్టుబడ్డాయి. దీంతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

yadadri sex racket
Author
Yadagirigutta, First Published Aug 18, 2018, 4:04 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో మరోసారి అలజడి రేగింది.  పోలీసుల వరుస దాడులతో ఇక్కడ వ్యభిచార వృత్తి అంతం అయిందని అందరు భావిస్తున్న సమయంలో మరోసారి వ్యభిచార ముఠాలు పట్టుబడ్డాయి. అంతే కాదు వారి వద్దనుండి ఏడుగురు చిన్నారులను  పోలీసులు కాపాడారు. ముఖ్యంగా పోలీసులు యాదగిరి గుట్టలోని సుభాష్ నగర్, అంగడి బజార్, గణేష్ నగర్లలో చేపట్టిన తనిఖీల్లో ఈ ముఠాలు పట్టుబడ్డాయి. దీంతో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి యాదగిరి గుట్టలోని వ్యభిచార గృహాల్లో బంధిస్తున్నట్లు గుర్తించిన ఎస్‌వోటి, స్థానిక పోలీసులు గత నెలలో ముమ్మర దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో వ్యభిచార నిర్వహకులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి భారి నుండి చిన్నారులను కాపాడారు. అయితే ఈ ఘటనపై పోలీసుల విచారణ జరపగా సంచలన నిజాలు బైటపడ్డాయి. చిన్నారులకు ఎదుగుదల హర్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకోసం వ్యభిచార నిర్వహకులకు సహకరిస్తున్న ఓ ఆర్ఎంపీ డాక్టర్ ను కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ దాడుల వల్ల భయపడిపోయిన యాదగిరి గుట్టలోని మిగతా వ్యభిచార నిర్వహకులు అక్కడి నుండి మిగతా ప్రాంతాలకు పారిపోవడం జరిగింది. అలాగే పలు కాలనీల్లో తాము స్వచ్చందంగా వ్యభిచార వృత్తిని వదిలేస్తున్నట్లు పోస్టర్లు, ప్లెక్సీలు వెలిశాయి. దీంతో ఇక ఈ పట్టణంలో వ్యభిచారం రూపుమాసిపోయినట్లే  అని అటు పోలీసులు ఇటు ప్రజలు భావించారు. అయితే తాజాగా మరోసారి ఇలా భారీ సంఖ్యలో వ్యభిచార నిర్వహకులు పట్టుబడటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

తాజా దాడుల్లో మరో ఏడుగురు ఉమెన్ ట్రాఫికర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఏడుగురు చిన్నారులను  కాపాడారు. చిన్నారులను చిల్డ్రస్ హోం కు తరలించిన పోలీసులు సదరు వ్యభిచార గృహాలను సీజ్ చేశారు. ఇలా ఇప్పటివరకు 24 మంది అరెస్ట్ కాగా వారిలో పలువురిపై పోలీసులు పిడి యాక్టు నమోదు చేశారు. 

సంబంధిత వార్తల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచారం మానేశాం, విటులు రావద్దంటూ పోస్టర్లు

యాదాద్రి సెక్స్ రాకెట్: తవ్విన కొద్దీ విస్తుపోయే విషయాలు

యాదాద్రి సెక్స్ రాకెట్: వ్యభిచార గృహాలకు తాళాలు, ఆ కాలనీలన్నీ నిర్మానుష్యం

Follow Us:
Download App:
  • android
  • ios