Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రి సెక్స్ రాకెట్... బిడ్డల కోసం పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా పోలీసులు ఇప్పటివరకు 15 మంది చిన్నారులను కాపాడారు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న చిన్నారులను గుర్తించిన పోలీసులు నిర్వహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న బాలికలకు వైద్య పరీక్షలు చేయించి చిల్డ్రన్ హోం కు తరలించారు.
 
yadadri operation muskan details

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా పోలీసులు ఇప్పటివరకు 15 మంది చిన్నారులను కాపాడారు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న చిన్నారులను గుర్తించిన పోలీసులు నిర్వహకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న బాలికలకు వైద్య పరీక్షలు చేయించి చిల్డ్రన్ హోం కు తరలించారు.

అయితే ప్రసార మాధ్యమాల ద్వారా చిన్నారుల ఫోటోలను చూసిన తల్లిదండ్రులు యాదగిరి గుట్ట పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన దుబ్బయ్య, విశ్రాంతమ్మలు ఓ బాలిక తమ కూతురే అంటూ పోలీసులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా వారు పోలీసుల ఎదుటు పెట్టారు.

ఇక బాధితుల్లోని మరో బాలిక తమ కూతురే అంటూ హైదరాబాద్ ఈసీఐఎల్ కు చెందిన అనురాధ-కృష్ణ దంపతులు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారు కూడా ఆధారాలను పోలీసుల ముందు పెట్టి తమ కూతురిని అప్పగించాలని వేడుకున్నారు. వీరే కాదు ఇంకా చాలా మంది పోలీసులకు ఫోన్ చేసి బాధితుల్లో తమ చిన్నారులు ఉన్నారంటూ బంధువులు, తల్లిదండ్రులు సమాచారం అందిస్తున్నారు.

అయితే పోలీసులు మాత్రం చిన్నారులకు డీఎన్ఎ పరీక్ష నిర్వహించాకే అప్పగిస్తామని చెబుతున్నారు. మరోసారి చిన్నారులు బలవకుండా ఉండేందుకు ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నామని, చిన్నారులు వారి సొంతవారి చెంతకు మాత్రమే చేర్చాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios