యాదాద్రి సెక్స్ రాకెట్... వ్యభిచారుణులనే తల్లులుగా భావిస్తూ రోదిస్తున్న చిన్నారులు

Yadadri child sex racket
Highlights

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో పాపపు పనులు చేస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజుల నుండి అక్కడి వ్యభిచార గృహాలపై ఎస్‌వోటి, స్థానిక పోలీసులు కలిసి దాడులు జరుపుతున్నారు. అయితే ఈ దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. 

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో పాపపు పనులు చేస్తున్న ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత వారం రోజుల నుండి అక్కడి వ్యభిచార గృహాలపై ఎస్‌వోటి, స్థానిక పోలీసులు కలిసి దాడులు జరుపుతున్నారు. అయితే ఈ దాడుల్లో సంచలన విషయాలు బైటపడ్డాయి. 

 వ్యభిచార గృహ నిర్వహకులు ఇతర ప్రాంతాల నుండి చిన్నారులను కిడ్నాప్ చేసి తీసుకువచ్చి వ్యభిచారం కోసం వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులను మొదట తమ పిల్లలుగానే సమాజానికి పరిచయం చేస్తున్నారు. చిన్నారుల పేరును ఆధార్ కార్డు, కుటుంబ రేషన్ కార్డులో చేర్చి తమ పిల్లలనే భ్రమను కల్పిస్తున్నారు. ఆ తర్వాత వీరు తమ అసలు పని ప్రారంభిస్తారు. పిల్లల శారీరక ఎదుగుదల కోసం ఆక్సిటోసిన్ వంటి ఇంజక్షన్లను వాడి వ్యభిచార వృత్తిలోకి తొందరగా వచ్చేలా చేస్తున్నారు. 

ఈ విషయాలను పసిగట్టిన రాజకొండ పోలీసులు వ్యభిచార గృహాల్లో  మగ్గుతున్నచిన్నారులను కాపాడటానికి ఆపరేషన్ ముస్కాన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటివరకు 15మంది చిన్నారులను కాపాడిన పోలీసులు 11మంది నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారులను సంక్షేమ గృహాలకు తరలించారు.

అయితే చిన్నారులు మాత్రం ఇంకా వ్యభిచార గృహ నిర్వహకులనే తమ కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. తమను తమ ఇంటికి పంపించాలని, అమ్మను చూడాలని ఉందంటూ ఏడుస్తున్నారు. దీంతో సంక్షేమ గృహ అధికారులు వారిని సముదాయిస్తున్నారు. అసలు తల్లిదండ్రులను గుర్తించే వరకు చిన్నారులు సంక్షేమ గృహాల్లోనే ఉంటారని పోలీసులు తెలిపారు.  

ఈ సెక్స్ రాకెట్ పై రాజకొండ డిసిపి మాట్లాడుతూ... వ్యభిచార గృహ నిర్వహకులు హైదరాబాద్, విజయవాడల నుండే ఎక్కువమంది పిల్లల్ని తీసుకువచ్చినట్లు గుర్తించామని తెలిపారు. వ్యభిచార ముఠా పిల్లల కోసం నాటకాలాడే అవకాశం ఉంది కాబట్టి అప్పగించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. డీఎన్ఎ పరీక్ష అనంతరమే పిల్లలను అప్పగిస్తామని ఆయన తెలిపారు.


సెక్స్ రాకెట్ కు సంబంధించిన మరిన్ని వార్తల కోసం కింది లింక్ లు క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/telangana/yadadri-sex-rocket-110-families-ran-away-with-girls-pd11qu

https://telugu.asianetnews.com/telangana/latest-updates-on-yadadri-sex-racket-pcxm7f

https://telugu.asianetnews.com/telangana/rachakonda-dcp-press-meet-on-yadadri-operation-muskan-pcvkpg

https://telugu.asianetnews.com/telangana/yadadri-operation-muskan-details-pcvj7e

 

loader