నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై 12 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నిజమాబాబాదులోని కలెక్టర్ కార్యాలయానికి అతి కొద్ది దూరంలోనే సోమవారం అర్థరాత్రి జరిగింది. 

ఎడవల్లి మండల కేంద్రానికి చెదిన ఓ మహిళ రెండు రోజు క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెను సోదరి నిజామాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చింది. పని మీద ఆమె సోమవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆ మహిళతో విక్కీ అనే యువకుడు మాట కలిపాడు. 

డబ్బుల అవసరం ఉందని మహిళ చెప్పడంతో తాను ఇస్తానని అతను నమ్మబలికాడు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ధర్నా చౌక్ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. ఈలోగా విక్కీ స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకున్నారు. మహిళపై 12 మంది ఒక్కరి తర్వాత ఒక్కరు అత్యాచారం చేశారు.

అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడం గమనించి పరారయ్యారు. అచేతనంగా కనిపించిన మహిళను పోలీసులు ప్రశ్నించారు. దాంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. బాధితురాలిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

నిజామాబాదులోని హమాలీవాడీకి చెందిన యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని, విక్కీ పెయింటర్ గా పనిచేస్తాడని పోలీసులు చెప్పారు. గస్తీ పోలీసుల సమాచారం ప్రకారం 8 మంది ఆమపై అత్యాచారం చేసి ఉంటారని కూడా అంటున్నారు.