ట్రాఫిక్ పోలీసులకు బూతుపురాణం.. చుక్కలు చూపించిన యువతి

Woman Misbehaves and scolded With Traffic Police In Hyderabad
Highlights

ట్టిన తిట్టు తిట్టకుండా.. బూతు పురాణం మొత్తం చదివేసింది. ఈ సంఘటన నగరంలోని అబిడ్స్ చెక్ పోస్టు వద్ద చోటుచేసుకుంది.

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నావని ప్రశ్నించినందుకు.. ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది.  తిట్టిన తిట్టు తిట్టకుండా.. బూతు పురాణం మొత్తం చదివేసింది. ఈ సంఘటన నగరంలోని అబిడ్స్ చెక్ పోస్టు వద్ద చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...అబిడ్స్ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ యువతి హెల్‌మెట్ లేకుండా వెళ్తోంది. దీంతో ఆమెను ఆపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు చేపాలని అడిగారు. అంతే...ఒక్కసారిగా ఆ యువతి బూతుపురాణం అందుకుంది.

 అసభ్యకర పదజాలంతో విరుచుకుపడిన యువతికి మొదట ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె తగ్గలేదు. దీంతో లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ యువతి ఎక్కడా బెదరలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వాహనాన్ని అక్కడే పెట్టి తాళం వేసి వెళ్లిపోయింది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.

loader