Asianet News TeluguAsianet News Telugu

వైద్యం కోసం వచ్చిన మహిళపై ఉస్మానియాలో గ్యాంగ్ రేప్

 వైద్యం కోసం వచ్చిన మహిళపై హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగింది.

Woman gang raped in Osmania hospital

హైదరాబాద్: వైద్యం కోసం వచ్చిన మహిళపై హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆ సంఘటన కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వార్డ్ బాయ్, అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్ హోంగార్డు, ప్రైవైట్ అంబులెన్స్ డ్రైవర్ ముగ్గురు కలిసి ఆ దారుణానికి ఒడిగట్టారు. 

అఫ్జల్ గంజ్ ఎస్సై సైదులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్ సమీపంలోని హీరానగర్ బస్తీకి చందిన ఓ మహిళ (35)ను ఈ నెల 2వ తేదీన భర్త కొట్టాడు. దాంతో ఆమె బంజారాహిల్స్ పోలీస్టు స్టేషన్ లో అదే రాత్రి ఫిర్యాదు చేసింది. 

మెడికో లీగల్ కేసు నమోదు చేయాలని ఉస్మానియా వైద్యులకు లేఖ రాసి ఆమె చేతికి ఇచ్చి పంపించారు. ఎస్కార్టును వెంట పంపించలేదు. ఉస్మానియాకు చేరుకున్న ఆమెకు అనుకోని ఘటన ఎదురైంది. 

ఉస్మానియా క్యాజువాలిటీ విభాగంలో విధులు నిర్వహించే వార్డ్ బాయ్ వైద్యం చేయించి భర్తపై కేసు నమోదు చేయిస్తానని నమ్మించాడు. వైద్యం చేయించిన తర్వాత వార్డ్ బాయ్ తో పాటు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, అఫ్జల్ గంజ్ ఔట్ పోస్టు హోం గార్డు కలిసితనను ఓపి భవనం మొదటి అంతస్థులోకి తీసుకుని వెళ్లి అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపించింది. 

ఉస్మానియాలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వార్జ్ బాయ్ నాగరాజుపైనే మహిళ ఫిర్యాదు చేసిందని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైదులు చెప్పారు. మరో ఇద్దరిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios