ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఆమెపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరగగా బాధితురాలి ఫిర్యాదుతో శనివారం వెలుగులోకి వచ్చింది. 

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి చెందిన 35 ఏళ్ల వివాహిత శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోతోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించారు. అరవకుండా నోరు అదిమిపట్టి ఆమెను బలవంతంగా టూవీలర్ తీసుకుని వెళ్లారు. 

Also Read: పట్టణం నడిబొడ్డులో బాయ్ ఫ్రెండ్ ను కొట్టి మహిళపై గ్యాంగ్ రేప్

మధ్యలో వారితో మరికొందరు యువకులు కలిశారు. ఆమెను అదే మండలంలోని హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశారు. పక్కింటి వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వారు పరారయ్యారు. 

తనపై హర్యాతండాకు చెందిన బాణోతు మోహన్, బాణోతు ఉపేందర్, అంగోతు కల్యాణ్, బాణోతు చంటి, అజ్మీరా నాగేశ్వర రావు, సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్, బీ సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీససులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగిన స్థలాన్ని పోలీుసులు పరిశీలించారు. నిందితులు అదే ప్రాంతంలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: అమీనాపూర్‌ ఘటనపై ఎస్పీ: బోయ్‌ప్రెండ్‌తో సినిమాకు, రేప్ నాటకం

నిందితులను అరె్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి గ్రామానికి చెందినవారు, బంధువులు రఘునాథపాలెం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయంం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.