గుర్తుతెలియని మహిళ మృతదేహం ఒకటి కలకలం రేపింది. ఆమె ఒంటిపై బంగారం అలానే ఉండటం... కనీసం ఒంటిపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటన నల్గొండ జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సోమవారం సాయంత్రం కౌలు రైతు బెత వెంకటరెడ్డి పశుగ్రాసం కోసం పొలం దగ్గరకు వెల్లగా చెడు వాసన వస్తూండటంతో చుట్టు పక్కల పరిశీలించారు. అక్కడ మహిళ మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి మృతదేహన్ని పరిశిలీంచగా సుమారు మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

Also Read హైద్రాబాద్‌లో విచారణ పేరుతో తల్లీ కూతుళ్లతో ఎస్ఐ వివాహేతర సంబంధం...

మృతిరాలి ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని, ఆమె ఒంటి మీద ఒంగారం వస్తువులు అలాగే ఉండటంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని వారు తెలిపారు. మహిళ చీర నేలపై పరిచి దానిమీద పడుకున్నట్లు ఆనవాళ్లు ఉండడంతో అత్యాచారం జరిగిఉండచ్చునే కోణంలో దర్యాప్తు చేస్తామని ఏఎస్‌ఐ సుందరయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హూజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.