యువతి స్నానం చేస్తుండగా రసహ్యంగా వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి సదరు యువతిని బెదిరించాడు. తన కోరిక తీర్చకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తీరా ఆమె అతని వల్ల గర్భవతికాగా.. తనకేమీ సంబంధం లేదంటూ తప్పించుకు తిరిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కొత్తపేటలో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్తపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 22ఏళ్ల యువతి గత ఏడాది ఇంటి వద్ద స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన లంక చినబాబు అనే యువకుడు తన ఫోన్ లో వీడియో తీశాడు. దానిని చూపించి యువతిని బెదిరించాడు.

Also Read వాట్సాప్ లో యువతి అసభ్య చిత్రాలు.. యువకుడు అరెస్ట్...

తన కోరిక తీర్చాలంటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడాడు. అతని కారణంగా యువతి గర్భం దాల్చింది. విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. వారు యువకుడి పెద్దలతో మాట్లాడారు. వాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన యువతి పోలీసులను ఆశ్రయించింది.

దీంతో.. నిందితుడైన చినబాబు.. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అందరి ముందు దండలు కూడా మార్చుకున్నారు. మారినట్లే నటించి పోలీసుల బారి నుంచి తప్పించుకున్నాడు. తాజాగా.. మళ్లీ నీ గర్భానికి నేను కారణం కాదంటూ సదరు యువతిని అవమానించడం మొదలుపెట్టాడు. నాకు నీతో ఏ సంబంధం లేదంటూ ఆమెను ఇంటి నుంచి కూడా గెంటేశాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.