Asianet News TeluguAsianet News Telugu

దిశ కేసు నిందితుల్లో... ఇద్దరు మైనర్లు..?

ఈ విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.

will two minors in disha rape Accused..?
Author
Hyderabad, First Published Dec 10, 2019, 8:34 AM IST

షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే... వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారనే వాదనలు వినపడుతున్నాయి. దిశ కేసులో నలుగురు నిందితులను పట్టుకున్న సమయంలో... మహ్మద్ ఆరిఫ్(26), జొల్లు శివ(20), జొల్లు నవీన్(20), చెన్నకేశవులు(20) ఏళ్లు అని పోలీసులు మీడియాకు వివరించారు.

AlsoRead దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసులకు చుక్కలేనా?...

అయితే... వారిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడాన్ని తప్పుపడుతూ సీన్ లోని మానవహక్కుల సంఘం విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.

దీంతో... వారి మాటలకు అధికారులు కంగుతిన్నారు. మీ కుమారులకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్స్ ని ఇవ్వండి అంటూ... అధికారులు వారి దగ్గర నుంచి సేకరించారు. వాటిలో ఒకరి పుట్టిన తేదీ 15-08-2002గా ఉంది. దీని ప్రకారం అతని వయసు 17 సంవత్సరాల ఆరునెలలు. ఆధార్ కార్డ్ లో మాత్రం పుట్టిన సంవత్సరం 2001గా ఉంది. 

మరో నిందితుడి పుట్టిన తేదీ సర్టిఫికేట్ లో 10-04-2004గా ఉంది. దీని ప్రకారం అతని వయసు 15 సంవత్సరాల 8నెలలు. ఇలా తేదీలు వేర్వేరుగా ఉండడంతో ఏది వాస్తవమనే సందేహాలు నెలకొన్నాయి. నలుగురు నిందితుల్లో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు లారీ డ్రైవర్లు అని పోలీసులు   చెప్పినా, వీరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేనట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios