అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ వేధిస్తున్నాడని కట్టుకున్నన భర్తనే అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

బొల్లారం సీఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాల మేరకు వెంకటయ్య (40)ను అతడి భార్య వెంకటమ్మ, మరో మహిళ లక్ష్మమ్మతో కలిసి హత్య చేసింది. ఈ నెల 17న వెంకటమ్మ తన భర్తను హత్య చేసి, భర్త కనిపించడం లేదంటూ 19న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదృశ్యమైన వెంకటయ్య భార్య చేతిలోనే హత్యకు గురైనట్లు తేల్చారు. 

Also Read భార్య మేనమామను కారుతో ఢీకొట్టి, 2 కిమీ ఈడ్చుకెళ్లి చంపేశాడు..

మృతుడు వెంకటయ్య భార్య వెంకటమ్మను అక్రమ సంబంధం పేరిట వేధింపులకు గురి చేస్తున్నాడని, అతడిని హతమార్చాలని భార్య పథకం వేసింది. ఇందులో భాగంగా తమ నివాసానికి సమీపంలో ఉండే లక్ష్మమ్మతో కలిసి సినిమాకు వెళ్దామంటూ భర్తను తీసుకొని వెళ్లారు. 

అనంతరం సినిమా వద్దని మద్యం కొనుగోలు చేసి భర్తకు అతిగా తాగించింది.  బొల్లారం శివారులో భర్త వెంకటయ్యపై రాళ్లతో దాడి చేసి, ఛాతిపై కొట్టి హత్య చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు సీఐ తెలిపారు.