Asianet News TeluguAsianet News Telugu

కారుకు ప్రమాదం: కొలిక్కి రాని జూపల్లి, హర్షవర్ధన్ వివాదం

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్ధులకు వ్యతిరేకంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన వర్గం అభ్యర్థులను బరిలోకి దింపారు.

why trs leadership not yet taken action against former minister Jupally Krishnar Rao
Author
Hyderabad, First Published Jan 17, 2020, 1:58 PM IST


మహాబూబ్‌నగర్: కొల్లాపూర్ లో మున్సిపల్ ఎన్నికల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వివాదం నాగర్ కర్నూల్, గద్వాల, షాద్ నగర్లపై ప్రభావం చూపిస్తోంది.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి వ్యతిరేకంగా సిట్టింగ్ మంత్రి కూడా ఒకరు పావులు కదుపుతుండంతో రాజకీయం ఆ రెండు నియోజకవర్గాల్లో రసవత్తరంగా మారింది.

Also read:తగ్గని జూపల్లి కృష్ణారావు: టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థులకు చిక్కులు

మున్సిపల్ ఎన్నికల్లో జూపల్లి వర్గానికి కొల్లాపూర్ లో టికెట్లు దక్కకపోవడంతో జూపల్లి వర్గం నేతలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులకు, జూపల్లి వర్గానికి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది.

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

 ఇదే మాదిరిగా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ, కల్వకుర్తి నియోజకవర్గం లోని మున్సిపల్ పట్టణాలలో కూడ ఇదే రకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి..
 దాదాపు 20 మంది అభ్యర్థులు మాజీ మంత్రి అనుచరులు పోటీలో ఉన్నారని ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారు.

Also read: మున్సిపల్ పోల్స్‌కు కాంగ్రెస్ మేనిఫెస్టో: ఓటర్లకు బంపర్ ఆఫర్స్

మాజీమంత్రి వ్యవహారంపై కొల్లాపూర్ ఎమ్మెల్యే తో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా పార్టీ  వర్కింగ్ ప్రేసిడెంట్ కు ఫిర్యాదు చేశారు. జుపల్లి కృష్ణారావు   పై తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

 అయితే పార్టీ పరంగా సీనియర్ నేత కావడంతో చర్యలు తీసుకునేందుకు పార్టీ ఆలోచిస్తుంది. ఇటీవలే  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయిన జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థులు తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

అయితే స్వతంత్ర అభ్యర్థుల తరఫున జుపల్లి ప్రచారం చేస్తున్న అంశం కూడా పార్టీ దృష్టికి రావడంతో పార్టీ ఎలా వ్యవహరిస్తోందోననే అనేది ఆసక్తికరంగా మారింది.

మాజీమంత్రి వ్యవహారం మూడు నాలుగు నియోజకవర్గాలలో ప్రభావితం చేస్తుండటంతో పార్టీ పెద్దలు కూడా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది పార్టీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో జూపల్లి ఎన్నికల బరిలో నిలిచి తన బలాన్ని నిరూ పించుకునేందుకు  ప్రయత్నిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios