Asianet News TeluguAsianet News Telugu

స్కూళ్ల డ్రగ్ విచారణ అందుకే స్లో అయిందా ?

  • నత్తనడకన స్కూల్ డ్రగ్ విచారణ 
  • సినిమా వాళ్ల విచారణలో అధికారుల బిజీ
  • స్కూళ్లకు నోటీసులపై అయోమయం
  • బాధిత పిల్తలల పేరెంట్స్ కే సమాచారం 
Why drug investigation slow down in the schools

హైదరాబాద్ లోని సంపన్నుల పిల్లలు చదివే పాఠశాలల్లోకి డ్రగ్ మాఫియా ఎంటర్ అయిందని ఎక్సైజ్ పోలీసులు హడావిడి చేసిర్రు. ఒకదశలో ఆ స్కూళ్ల పేర్లు కూడా వ్యూహాత్మకంగా లీక్ చేసిరు. డజనుకు పైగా స్కూళ్ల జాబితాను అనధికారికంగా వెల్లడించారు. మరో డజను వరకు కాలేజీల పేర్లు కూడా బయటకొచ్చాయి. కానీ ఏమైందో ఏమో స్కూళ్ల డ్రగ్ విచారణ నత్తనడకన సాగుతున్నది. ఏం జరిగిందన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డ్రగ్ మాఫియాకు హైదరాబాద్ అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులకు సైతం డ్రగ్ అంటకట్టి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పాఠశాలల్లోని 8వ తరగతి నుంచే ఆడ, మగ పిల్లలు డ్రగ్స్ వాడకం షురూ అయింది. హైదరాబాద్ లోని టాప్ స్కూళ్లన్నీ డ్రగ్ మాఫియా గుప్పిట చేరిపోయినట్లు వార్తలొచ్చాయి. స్కూళ్లలో తిష్ట వేసిన డ్రగ్ మాఫియాను రూపుమాపేందుకు ఎక్సైజ్ పోలీసులు ఈమధ్య కాలంలో విచారణలో స్పీడ్ తగ్గించినట్లు కనిపిస్తోంది.

ఈ విషయంలో విచారణాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారంటూ విద్యాశాక మంత్రి కడియం శ్రీహరి ఒకదశలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్కూళ్లకు నోటీసులు కూడా ఇవ్వబోతున్నాము అంటూ హడావిడి చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ వారు. కానీ ఏమైందో ఏమో ఆమాటెత్తడంలేదు. ఇక గ్లామర్ ప్రపంచానికి పెట్టింది పేరైన సినిమా రంగం మీదకు డ్రగ్ కేసు మల్లించారు. రోజుకొక సినీ స్టార్ ను విచారిస్తూ హల్ చల్ చేస్తున్నారు. మరి స్కూళ్ల విచారణ ఏమైందన్న ప్రశ్నకు నేరుగా సమాధానం రావడంలేదు.

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు... డ్రగ్ మాఫియా కట్టడిలో స్కూళ్ళకు కాకుండా ఆయా స్కూళ్లలో అడిక్ట్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వివరించే పని చేస్తారట. దీనివల్ల స్కూళ్ల పేర్లు బయటకు రావడంతోపాటు ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరూ ఆందోళన చెందే ప్రమాదముందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. మరోవైపు స్కూల్ పిల్లల వ్యవహారం కాబట్టి చాలా సెన్సిటీవ్ కోణంలో జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ స్కూల్ పిల్లల విచారణ బహిర్గతమైతే ఒకవేళ వారు పొరపాటున ఏ అఘాయిత్యానికో పాల్పడే ప్రమాదం ఉన్నందున అత్యంత సున్నితంగా స్కూళ్ల కేసును డీల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు సర్కారు వైఖరిని తప్పుపడుతున్నారు విపక్ష నేతలు. స్కూళ్లకు నోటీసులు అంటూ హడావిడి చేసి ఇప్పుడు సినిమావాళ్లతో టైంపాస్ చేస్తున్నారంటూ చురకలంటిస్తున్నారు. మియాపూర్ భూముల కుంభకోణంపై చర్చను పక్కదారి పట్టించేందుకే డ్రగ్ కేసును బయటకు తీశారని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. మొత్తానికి కారణాలేమైనా స్కూళ్ల డ్రగ్ కేసు విచారణ మాత్రం స్లో డౌన్ అయిందని అందరూ అంగీకరిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios