Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ వాడుతున్న వారి జాబితా సేకరిస్తున్నాం.. డిమాండ్ తగ్గిస్తే సరఫరా అడ్డుకోవచ్చు.. సీపీ సీవీ ఆనంద్

ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు  ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. Decoy operation చేసి సరఫరాదారులను హైదరాబాదుకు రప్పించామని చెప్పారు. ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్టలోని ఓ హోటల్లో బస చేయగా దాడి చేసి అరెస్ట్ చేశామని  సీవీ ఆనంద్ వెల్లడించారు.

We are collecting a list of those who are using drugs says CP CV Anand
Author
Hyderabad, First Published Jan 6, 2022, 2:00 PM IST

హైదరాబాద్ : నగరానికి Drug supply చేస్తున్న మూడు ముఠాల్లోని ఏడుగురిని arrest చేసినట్లు హైదరాబాద్ CP CV Anand వెల్లడించారు. వారి నుంచి 99 గ్రాముల కొకైన్,  45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎల్ఎస్డీఈ, 27 ఎక్స్ టసీ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. Nigeriaకు చెందిన ప్రధాన నిందితుడు Tony డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు చెప్పారు.

ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు  ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. Decoy operation చేసి సరఫరాదారులను హైదరాబాదుకు రప్పించామని చెప్పారు. ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్టలోని ఓ హోటల్లో బస చేయగా దాడి చేసి అరెస్ట్ చేశామని  సీవీ ఆనంద్ వెల్లడించారు.

చాదర్ ఘాట్ కు చెందిన కైసర్ ముంబయి ముఠాతో చేతులు కలిపి హైదరాబాదులో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు చెప్పారు. తిరుమలగిరి పోలీసులు కూడా ఇద్దరు సభ్యులు  ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మత్తుపదార్థాల టాబ్లెట్ను స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. !

మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి జాబితా సేకరిస్తున్నామన్నారు. డ్రగ్స్ బాధితుల విషయంలో ఇన్ని రోజులు మానవీయ కోణంలో ఆలోచించామని వెల్లడించారు.  అవసరమైతే వాళ్లను చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. డ్రగ్స్ డిమాండ్ ను తగ్గిస్తే సరఫరా అడ్డుకోవచ్చని సీపీ సీవీ ఆనంద్ వివరించారు. 

కాగా, హైదరాబాద్‌లో భారీగా drugs పట్టుబడ్డాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న Mumbai gangను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ డ్రగ్స్ ను New Year celebrations కోసం తీసుకొచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 16 లక్షలు ఉంటుందని అంచనా వేస్తు్న్నారు. 

వీరిదగ్గరున్న Cocaine, heroin, మత్తు పదార్థాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. ముంబయికి చెందిన ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నాడు. 

తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు: భారీగా నగదు సీజ్

ఇతనే ముంబయి నుంచి నగరానికి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోనీని అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుడిగా భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మధ్యాహ్నం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, సంచలనం సృష్టించిన Tollywood Drugs Case వ్యవహారంలో Enforcement Directorate (ఈడీ) చేపట్టిన దర్యాప్తు తుస్సు మంది. మత్తుమందుల దిగుమతితో పాటు నిధుల మళ్లింపు వ్యవహారం నిగ్గు తేల్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.  వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మూసివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios