హన్మకొండ:ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్ధినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానంతో ఆ బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 

15 ఏళ్ల మైనర్ బాలిక నానమ్మ వద్ద ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది. హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్ అనే యువకులతో ఈ బాలికతో పరిచయం ఉంది. ఆ బాలికను మాయామాటలు చెప్పి పెంబర్తికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఇద్దరితో పాటు మరో మైనర్ బాలుడు కూడ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ ముగ్గురు కూడ పారిపోయారు. ఇంటికి వచ్చిన బాలిక విషయాన్ని నానమ్మకు చెప్పింది. ఆ తర్వాత ఇంట్లోనే ఆదివారం తెల్లవారుజామున ఉరేసుకొని చనిపోయింది. 

 బాలికపై అత్యాచారానికి పాల్పడిన తిరుపతితో పాటు మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ప్రసన్నకుమార్ పరారీలో ఉన్నాడు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబం కేయూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.