Asianet News TeluguAsianet News Telugu

కొడుకు ముందే తండ్రిని కొట్టిన వనపర్తి పోలీసులు:రంగంలోకి కేటీఆర్

వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించారనే నెపంతో పదేళ్ల కొడుకు ముందే ఒ వ్యక్తిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ పిల్లాడు వేడుకొంటున్నా కూడ పోలీసులు వినలేదు. తండ్రితో పాటు కొడుకును కూడ  పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. 

Wanaparthy police brutally attacked man infront of his 10 year old child
Author
Hyderabad, First Published Apr 2, 2020, 2:09 PM IST

వనపర్తి: వనపర్తి జిల్లాలో లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘించారనే నెపంతో పదేళ్ల కొడుకు ముందే ఒ వ్యక్తిని పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని కొట్టొద్దని ఆ పిల్లాడు వేడుకొంటున్నా కూడ పోలీసులు వినలేదు. తండ్రితో పాటు కొడుకును కూడ  పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ ఘటనను రికార్డు చేసిన ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  నిబంధనలను ఉల్లఘిస్తూ మోటార్ బైక్ తన పదేళ్ల కొడుకుతో ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చాడు.నిబంధనలను ఉల్లంఘించారని ఆ వ్యక్తిని చితకబాదారు.

ఆ వ్యక్తిని కిందపడేసి కొట్టారు. పిడిగుద్దులతో విచక్షణ రహితంగా కొట్టారు. తన తండ్రిని వదిలిపెట్టాలంటూ ఆ కొడుకు కోరినా కూడ పట్టించుకోలేదు. ఆ పిల్లాడి ముందే బూతులు తిట్టారు. తండ్రి కొడుకులను పోలీస్ వ్యాన్ లో ఎక్కించారు.

 

 

ఈ తతంగాన్ని రికార్డు చేసి లక్ష్మణ్ అనే వ్యక్తి  కేటీఆర్ కు ట్వీట్ చేశారు.  ఈ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. ఈ తరహ ఘటనలు ఏ మాత్రం సమర్ధనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ప్రజల కోసం పనిచేస్తున్న వేలాది మంది పోలీసులకు ఈ తరహ ఘటనలు చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డికి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఈ విషయమై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు.

ఈ ఘటనపై వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన కానిస్టేబుల్ ను గుర్తించి చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆమె చెప్పారు, భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి, మంత్రి కేటీఆర్ కు ఆమె ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios